Rahul Gandhi New Look: కొత్తలుక్‌లో కనిపించిన రాహుల్‌ గాంధీ.. ఇంతకీ విశేషమేమంటే..

రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో రాహుల్ గాంధీ గడ్డం పెంచారు. నెరసిన గడ్డం, తెల్ల టీ షర్టులో మొత్తం యాత్ర మొత్తం కొనసాగింది. ఆ తర్వాత కూడా దాదాపు..

Rahul Gandhi New Look: కొత్తలుక్‌లో కనిపించిన రాహుల్‌ గాంధీ.. ఇంతకీ విశేషమేమంటే..
Rahul Gandhi New Look
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 01, 2023 | 11:09 AM

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇంగ్లాండ్‌లో వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం (ఫిబ్రవరి 28) బ్రిటన్‌ చేరుకున్నారు. అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు బుధవారం (మార్చి 1) ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సుప్రియ భరద్వాజ్‌ అనే ట్విటర్ యూజర్‌ రాహుల్‌ గాంధీతో సెల్ఫీ దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారు. రాహుల్‌ గాంధీ కేంబ్రిడ్జ్‌ చేరుకున్నారనే క్యాప్షన్‌తో పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో రాహుల్‌ గాంధీ స్పెషల్ లుక్‌లో కనిపించడమే అందుకు కారణం. ట్రిమ్‌ షేవింగ్‌తో, హెయిర్‌ కటింగ్‌ చేయించుకుని, సూటు వేసుకుని, టై ధరించి మునుపెన్నడూ చూడని విధంగా ఉన్నారు.

యూకే పర్యటనకు ముందు రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో రాహుల్ గాంధీ గడ్డం పెంచారు. నెరసిన గడ్డం, తెల్ల టీ షర్టులో మొత్తం యాత్ర మొత్తం కొనసాగింది. ఆ తర్వాత కూడా దాదాపు ఆలాగే కనిపించారు. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారంటూ రాహుల్‌పై పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఐతే తాజా ఇంగ్లాండ్‌ పర్యటనలో రాహుల్‌ పూర్తిగా తన స్టైల్‌ను మార్చేశారు. విజిటింగ్‌ ఫెలోగా రాహుల్‌ యూకేలేని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ‘Learning to listen in the 21st century’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. వారంరోజుల ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా మార్చి 5న లండన్‌లోని భారతీయ ప్రవాసులతో సంభాషించనున్నారు. లండన్‌లోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) సభ్యులతో కూడా ఆయన సమావేశంకానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు