AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడల్‌ హత్యకేసులో కీలక అప్‌డేట్.. తల, చేతులను ముక్కలు చేసి సూప్ వండిన మాజీ భర్త

హాంకాంగ్‌ మోడల్‌ అబ్బి చోయ్ (28) అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నటి కాళ్లు ఫ్రిడ్జ్‌లో కనిపించగా.. తల, మొండెం, చేతుల కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.  డాగ్‌ స్క్వాడ్‌, డ్రోన్లుతోపాటు డ్రైనేజీలో కూడా..

మోడల్‌ హత్యకేసులో కీలక అప్‌డేట్.. తల, చేతులను ముక్కలు చేసి సూప్ వండిన మాజీ భర్త
Hong Kong Model Murder Case
Srilakshmi C
|

Updated on: Mar 01, 2023 | 10:34 AM

Share

హాంకాంగ్‌ మోడల్‌ అబ్బి చోయ్ (28) అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నటి కాళ్లు ఫ్రిడ్జ్‌లో కనిపించగా.. తల, మొండెం, చేతుల కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.  డాగ్‌ స్క్వాడ్‌, డ్రోన్లుతోపాటు డ్రైనేజీలో కూడా వెతికారు. ఈ క్రమంలో మానవ అవశేషాలు ఉన్న రెండు సూప్‌ కుండలను హత్య చేసిన ఇంట్లో పోలీసులు కనుగొన్నారు. వాటిల్లోని ఒక కుండలో హత్యకు గురైన మోడల్‌ తల కనుగొన్నట్లు హాంకాంగ్‌ పోలీసులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సూపరింటెండెంట్ అలాన్ చుంగ్ మాట్లాడుతూ.. క్యారెట్, ముల్లంగితో తయారు చేసిన సూప్‌ కుండ నిండుగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. సూప్‌ పాట్‌లోని ద్రవ్యంలో పైన తేలుతున్న తల కనిపించింది. తలపై చర్మంతోపాటు, మాంసం పూర్తిగా తొలగించి ఉంది. చూడటానికి పుర్రెలా ఉంది. సూప్‌లో ఇతర మాంసం ముక్కలు కూడా ఉన్నాయి. అవి మానవ మాంసం అవశేషాలుగా గుర్తించాం. ఫోరెన్సిక్‌ రిపోర్టులో పుర్రె వెనుక భాగంలో రంద్రం ఉన్నట్లు తెలిసింది. నిందితులు కారులో దాడికి పాల్పడి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు.

కాగా హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ అబ్బి చోయ్ గత ఫిబ్రవరి 21 నుంచి కనబడటం లేదంటూ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత తై పో జిల్లాలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలను పోలీసులు కనుగొన్నారు. అదే ఇంట్లో ఎలక్ట్రిక్ రంపం, మాంసం స్లైసర్, దుస్తులు, మోడల్‌ ఐడీకార్డులతో సహా ఇతర వస్తువులను పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో చోయ్ మాజీ భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్ ఉన్నారు. ఇక చోయ్‌ మాజీ అత్త అయిన జెన్నీ లీ సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించింది. వీరు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. సోమవారం వీరికి బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మోడల్‌ అబ్బి చోయ్ ఆస్తులపై కన్నేసి, ఆమె మాజీ భర్త ఈ హత్యకు కుట్రపన్నినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.