KP Singh: ’91 ఏళ్ల వయసులో.. ఆమెప్రేమలో పడ్డాను, తను చాలా చురుకైనది’

రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం, డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ కేపీ సింగ్‌ 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు. భార్య ఇందిరతో 65 ఏళ్ల బంధం, ఆమె మరణం తర్వాత..

KP Singh: '91 ఏళ్ల వయసులో.. ఆమెప్రేమలో పడ్డాను, తను చాలా చురుకైనది'
KP Singh
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 28, 2023 | 12:40 PM

రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం, డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ కేపీ సింగ్‌ 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు. భార్య ఇందిరతో 65 ఏళ్ల బంధం, ఆమె మరణం తర్వాత ఎంతో కుంగిపోయానన్నారు. ఇన్నాళ్లకు తనకు ఓ తోడు దొరికిందని తాజాగా ప్రకటించారు. భాగస్వామిని కోల్పోతే, గతంలో మాదిరిగా ఉత్సాహంగా ఉండలేమన్నారు. జీవితంలో మనిషికి ఓ భాగస్వామి ఉండాలి. నాకు సంపూర్ణ మద్దతునిచ్చే మిత్రురాలు నా భార్యే. మేము మంచి భాగస్వాములం. ఆమెను కాపాడుకునేందుకు నేను సర్వశక్తులా ప్రయత్నించాను. కానీ 2018లో ఆమె నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. తానూ పోతూ నా దగ్గర ఓ మాటతీసుకుంది. తన మరణం తర్వాత నా జీవితాన్ని యథావిధిగా కొనసాగాంచాలని కోరింది. ఈ జీవితం మళ్లీ నీకు తిరిగిరాదని హెచ్చరించింది. ఐతే నా భర్య మరణం తర్వాత మానసికంగా కుంగిపోయాను. మీకు ఓ కంపెనీని నిర్వహించే శక్తిని అది ఇవ్వదు. సహజంగానే మీరు 65 ఏళ్ల భాగస్వామ్యం తర్వాత భార్యను కోల్పోతే గతంలో మాదిరి ఉండలేరు. అందుకే నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇన్నాళ్లకు నాకో తోడు దొరికిందని కేపీ సింగ్‌ ఓ ప్రకటనలో వివరించారు. ఆమె పేరు షీనా. ఆమె నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతున్నారు. చాలా మంది నాకు 70 ఏళ్లు అనుకొంటారు. అందుకు కారణం నేను ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండటమేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తెలిపారు.

భార్య మరణం తర్వాత నుంచి కంపెనీ యాజమాన్యంలో చురుకైన పాత్ర నుంచి వైదొలుగుతున్నట్లు సింగ్‌ చెప్పారు. కంపెనీ కోసం పనిచేసే సమయంలో పాజిటివ్‌గా ఉండటం చాలా అవసరం. ప్రేమించిన వారు దూరమైతే ప్రతిస్పందన తత్వం నెమ్మదిస్తుంది. బాధలో ఉన్నప్పుడు పూర్తి సేవలు అందించలేరు. యాజమాన్య బాధ్యతలు నా కుమారుడికి అప్పగించాను. పని నుంచి విముక్తి పొంది ఇష్టమైన పనులు చేయడానికి సమయం వెచ్చిస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఎందరో స్నేహితులున్నారు. నేను గోల్ఫ్‌ కూడా చాలా బాగా అడతానని తన వ్యక్తిగత జీవితం గురించి పలు అంశాలను పంచుకున్నారు. కాగా కేపీ సింగ్‌ మామగారు స్థాపించిన డీఎల్‌ఎఫ్‌లో 1961లో ఆయన చేరారు. దాదాపు 5 దశాబ్దాలపాటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేసి, 2020లో ఛైర్మన్‌గా పదవీవిరమణ చేశారు. కేపీ సింగ్‌ ఆస్తి విలువ రూ.66 వేల కోట్లు. సింగ్‌ భార్య క్యాన్సర్‌తో మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.