AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ప్రభుత్వ ఉద్యోగం లేదన్న చింతనే అవసరం లేదు.. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తే లక్షల్లో ఆదాయం

అందరికీ ప్రభుత్వోగం కావాలంటే కష్టం. ప్రభుత్వ ఉద్యోగం ఒకటే కాదు..అనేక కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. కాస్త తెలివితో ఆలోచించి పనిచేస్తే..ప్రభుత్వ ఉద్యోగం కంటే ఎక్కువ సంపాదించవచ్చు.

Business Ideas: ప్రభుత్వ ఉద్యోగం లేదన్న చింతనే అవసరం లేదు.. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తే లక్షల్లో ఆదాయం
vastu
Madhavi
| Edited By: |

Updated on: Mar 01, 2023 | 11:54 AM

Share

అందరికీ ప్రభుత్వోగం కావాలంటే కష్టం. ప్రభుత్వ ఉద్యోగం ఒకటే కాదు..అనేక కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. కాస్త తెలివితో ఆలోచించి పనిచేస్తే..ప్రభుత్వ ఉద్యోగం కంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఒకరి వద్ద పనిచేయకూడదన్న భావన మీలో ఉంటే మీరే సొంతగా వ్యాపారం ప్రారంభించవచ్చు. వ్యాపారానికి చదవుతో సంబంధం లేదు. తెలివితేటలు ఉంటే చాలు. మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే…నిత్యం ప్రతిఒక్కరికీ ఉపయోగపడే డిటర్జెంట్ పౌడర్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి. పెట్టుబడి తక్కువ,ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆర్జించే వ్యాపారం ఇది. ప్రతి ఇంట్లో డిటర్జెంట్ పౌడర్ ఉపయోగిస్తారు. దీంతో మార్కెట్లో ఉత్పత్తికి కూడా డిమాండ్ పెరుగుతోంది.

డిటర్జెంట్ పౌడర్ ఎలా తయారు చేయాలి?

డిటర్జెంట్ పౌడర్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు సరైన స్థలం ఎంపిక చేసుకోవాలి. కనీసం వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉండాలి. యంత్రాలు అవసరం. రిబ్బన్ మిక్సర్ మిషిన్, సీలింగ్ , స్క్రాబ్లింగ్ మెషీన్లను కొనుగోలు చేయాలి. ఈ మేషిన్లన్నంటిని కొనుగోలు చేసేందుకు దాదాపు 4లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ముడిపదార్థాలు, యాసిడ్ స్లర్రీ, బొగ్గు, పెయింట్, యూరియా, వాషింగ్ సోడా వంటి ముడి సరుకులు కొనుగోలు చేయాలి. ఇవన్నీ ఒకేసారి కొనుగోలు చేస్తే ధర కూడా తగ్గుతుంది. వీటిని ఆన్ లైన్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రిజిస్ట్రేషన్ :

మీరు ఏదైనా కంపెనీని ప్రారంభించే ముందు, దానిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా అవసరం. మీరు తప్పనిసరిగా మునిసిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీ వంటి స్థానిక సంస్థతో మీ కంపెనీని రిజిస్టర్ చేసుకోవాలి.

కార్మికులు:

కార్మికులు లేకుండా డిటర్జెంట్ పౌడర్ వ్యాపారం చేయడం కష్టం. ఒకవేళ డబ్బు కొరత ఉంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు. లేదంటే 7 లేదా 8 మంది కార్మికులను నియమించుకుంటే మంచిది.

రుణం:

చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. దీని కోసం మీరు ముద్రా యోజన స్కీంను సద్వినియోగం చేసుకోవచ్చు. జాతీయ బ్యాంకు కానీ …ప్రైవేటు బ్యాంకు నుంచి కానీ రుణం పొందవచ్చు.

ఖర్చు, లాభం:

మీరు ఒక కిలో డిటర్జెంట్ పౌడర్‌పై దాదాపు రూ.15 సంపాదించవచ్చు. అంటే రోజుకు వంద కిలోల డిజటర్జెంట్ తయారు చేస్తే 1500రూపాయలు పొందవచ్చు. ఈ లెక్కన రోజుకు 200కిలోలు అయితే మూడు నుంచి నాలుగు వేలు సులభంగా సంపాదించవచ్చు. అంటే నెలకు 60 నుంచి 70వేలు సంపాదించవచ్చు. నాణ్యమైన డిటర్జెంట్ తయారు చేస్తే మరిన్ని లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..