Business Ideas: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలంటే ఈ వ్యాపారం బెస్ట్.. లక్షల్లో ఆదాయం పొందొచ్చు..
కొన్ని వస్తువులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. వాటిలో దుస్తులు ఒకటని చెప్పొచ్చు. మన దేశం ఎంత ఆధునికమైనా చీరలకు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.

కొన్ని వస్తువులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. వాటిలో దుస్తులు ఒకటని చెప్పొచ్చు. మన దేశం ఎంత ఆధునికమైనా చీరలకు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. చీరల విక్రయం ద్వారా భారీ లాభాలను పొందవచ్చు. మీకున్న ఆర్థిక స్తోమతను బట్టి ఈ వ్యాపారం ప్లాన్ చేసుకోవచ్చు. అద్దెకు షాప్ తీసుకునే ఆర్థిక స్తోమత లేకపోతే.. తమ ఇంటిలోనే ఈ బిజినెస్ చేసుకునేందుకు వీలుంటుంది.
భారతీయ మహిళలను చీరలు ఆకర్షిస్తాయి. అందమైన చీరలు కొనేందుకు మహిళలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఎప్పుడూ డిమాండ్ ఉండే ఈ చీరల వ్యాపారాన్ని ప్రారంభించి లక్షల ఆదాయం సంపాదించవచ్చు. రూపాయి పెట్టుబడి లేకుండా ఇంట్లోనే చీరల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.
దుకాణం కోసం స్థలాన్ని ఎంచుకోవాలి:
మీ ఇల్లు రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్నట్లయితే.. మీ ఇంట్లోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఎందుకంటే మహిళలకు అవసరమైనవన్నీ ఇంటి దగ్గర అందుబాటులో ఉంటే..మీ ఇంట్లోనే షాపింగ్ చేస్తారు. ఒకవేళ ప్రత్యేకంగా దుకాణం ప్రారంభించాలనుకుంటే రద్దీగా ఉండే మార్కెట్ లాంటి ప్రాంతంలో దుఖానాన్ని ప్రారంభించాలి.




ఈ విషయాలపై ఎక్కువగా దృష్టి సారించాలి:
ఫ్యాషన్, ట్రెండీగా ఉండే చీరలను సెలక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో లభించే లెటేస్ట్ మోడల్స్ ను మహిళలు ఇష్టపడతారు. కాబట్టి మీరు ఫ్యాక్టరీ నుంచి రెండు మూడు నెలల ముందే ఆర్డర్ చేయాలి. గ్రామంలో దుకాణం పెట్టినట్లయితే తక్కువ ధరకు లభించే చీరలు మాత్రమే ఉంచండి. ఒకవేళ నగరంలో ఉన్నట్లయితే..తక్కువ ధర, ఎక్కువ ధర చీరలు రెండూ కలిపి ఉంచండి. అంతేకాదు దీపావళి, దసరా, సంక్రాంతి వంటి పండగలకు కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను అందించండి.
చీరల వ్యాపారంలో లాభాలు రావాలంటే:
దుకాణంలో కానీ, ఇంట్లో కానీ చీరలతోపాటు వాటికి వస్తువులను కూడా ఉంచాలి. ఉదాహరణకు బ్లౌజ్, బ్లౌజ్ పీస్లు, సారీపెట్టికోట్లు ఇవన్నీ కూడా ఉంచుకోవాలి. అన్నీ ఒకేచోట ఉంటే కస్టమర్లు ఎక్కువగా వస్తుంటారు.
జీఎస్టీ అవసరం:
మీరు చీరల వ్యాపారం ప్రారంభిస్తుంటే జీఎస్టీ అవసరం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభిస్తే అవసరం ఉండదు.
చీరలు ఎక్కడి నుంచి తీసుకురావాలి:
చీరల వ్యాపారం ప్రారంభించే ముందు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలుసుకోవాలి. చీరలు ఎక్కువగా సూరత్ లో లభిస్తుంటాయి. అక్కడ వందలాది చీరల ఫ్యాక్టరీలు ఉంటాయి. అక్కడి నుంచి చీరలను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. లేదంటే మీకు అనుకూలమైన ప్రదేశం ఉంటే అక్కడి నుంచి ఆర్డర్ చేయవచ్చు.
ఖర్చు లాభం:
ఈ బిజినెస్ తక్కువ ఖర్చుతో ప్రారంభిస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ఇంట్లో నుంచే చీరల బిజినెస్ ప్రారంభించాలనుకుంటే రూ. 50వేలు ఖర్చు వస్తుంది. క్రమంగా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. దుకాణం తెరిచి వ్యాపారం చేయాలనుకుంటే..లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి