AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Problems: రోడ్డుపై వెళ్తున్నప్పుడు కంట్లో నలుసు సమస్య ఇబ్బంది పెడుతుందా? వెంటనే ఉపశమనం పొందండిలా..

ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు రోడ్డుపై ఉండే దుమ్ము ధూళి వల్ల కంటి సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు కంట్లో దుమ్ము పడినప్పుడు వచ్చే ఇబ్బంది వర్ణనాతీతం.

Eye Problems: రోడ్డుపై వెళ్తున్నప్పుడు కంట్లో నలుసు సమస్య ఇబ్బంది పెడుతుందా? వెంటనే ఉపశమనం పొందండిలా..
Eyes
Nikhil
|

Updated on: Feb 23, 2023 | 2:20 PM

Share

పెరుగుతున్న వాహనాలు, ఫ్యాక్టరీలు కారణంగా ప్రతిచోట కాలుష్యం సమస్య వేధిస్తుంది. కాలుష్యం వల్ల వెంటనే ఇబ్బంది పడకపోయినా క్రమేపి ఇబ్బందులు పెరుగుతాయి. అయితే ముఖ్యంగా కాలుష్యం వల్ల వెంటనే ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది. అవే కంటి సమస్యలు. కాలుష్యం వేగంగా పెరిగితే కంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు రోడ్డుపై ఉండే దుమ్ము ధూళి వల్ల కంటి సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు కంట్లో దుమ్ము పడినప్పుడు వచ్చే ఇబ్బంది వర్ణనాతీతం. ముఖ్యంగా ప్రయాణం అయిపోయిన తర్వాత కంట్లో గరగరమంటూ ఇసుక రేనువు ఇరుక్కుపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే కంటి సమస్యలు ఇబ్బంది పెట్టినప్పుడు కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కళ్లను తరచూ శుభ్రం చేసుకోవడమే కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొంటున్నారు. నిపుణులు సూచించే కంటి రక్షణ చర్యల గురించి ఓ సారి తెలుసుకుందాం.

  1. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కంట్లో ఏదైనా నలుసు పడితే వేరే కన్నును మూసి ఉంచితే నలుసు పడిన కంట్లో నుంచి నీరు రావడం మొదలవుతుంది. ఇలా చేయడం వల్ల నలుసు బయటకు వచ్చే అవకాశం ఉంది.
  2. ముఖ్యం కంట్లో నలుసు పడినప్పుడు చాలా మంది కంటిని రుద్దుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కన్ను బాగా ఎర్రగా మారుతుంది. కాబట్టి కంట్లో నలుసు పడినప్పుడు రుద్దకుండా ఉండడం ముఖ్యం.
  3. వీలైనంత త్వరగా కంటిని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.
  4. కంట్లో నలుసు పడితే పర్వాలేదు కానీ ఏదైనా పురుగు పడితే వెంటనే వచ్చేసినా దాని రెక్కలు లేదా ఇతర పదార్థాలు కంట్లోనే ఉండిపోతాయి. మీకు ఇరిటేషన్ తీరిపోయినా కూడా ఇలాంటి సమయంలో కంటి వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
  5. ఒక వేళ ఆకు, పొట్టు ధాన్యం వంటి మొక్కల సంబంధిత పదార్థం కంట్లో ఇరుక్కుపోతే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 
  6. చిన్న నలుసైనా కంట్లో ఇరుక్కుపోతే తెల్లవారుజామున కన్ను తెరవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సమయంలో కచ్చితంగా కంటి వైద్యుడిని సంప్రదించాలి. 
  7. కంటి సమస్యల నుంచి నివారణకు కచ్చితంగా కళ్లజోడును వాడాలి. ముఖ్యంగా పొలాల్లో పని చేసేవారైతే కళ్లల్లో ఏమి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  8. అలాగే కంట్లో ఏదైనా పడినప్పుడు చిన్నపాటి కంటి అరుకులను వాడితే ఉపశమనం ఉంటుంది. ఇలా లేని సమయంలో వైద్యసాయం పొందాలి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి