AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Bite Problems: అయ్య ‘భౌ’బోయ్.. భయపెడుతున్న వీధి కుక్కలు.. రాత్రిళ్లు ఒంటరిగా కనిపిస్తే దాడి మొదలు..

రాత్రి సమయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తున్న వారిపై వాటి దాడులు షరామామూలుగా మారాయి. వాటి సంతానోత్పత్తి కూడా విపరీతంగా పెరగడంతో వీధుల్లో కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. రాత్రి సమయంలో దాడులు చేసే కుక్కలు ఒంటరిగా కనిపిస్తే పగలు కూడా దాడులు చేసే పరిస్థితి నెలకొంది.

Dog Bite Problems: అయ్య ‘భౌ’బోయ్.. భయపెడుతున్న వీధి కుక్కలు.. రాత్రిళ్లు ఒంటరిగా కనిపిస్తే దాడి మొదలు..
Street Dogs
Nikhil
|

Updated on: Feb 23, 2023 | 2:10 PM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్..అదే వీధి కుక్కల దాడులు. ఇటీవల హైదరాబాద్‌ ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన తీవ్రంగా కలకలం రేపింది. ఈ విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ హైకోర్టు కూడా సుమోటో కేసు విచారిస్తున్నామని తెలిపింది. అయితే కుక్కలు అంటే చాలా విశ్వాసంగా ఉండే జంతువులను అందరికీ తెలిసిన విషయమే. చాలా మంది కుక్కలు పెంపుడు జంతువుగా పెంచుకుంటారు. అంతేకాకుండా వాటిని కుటుంబ సభ్యులుగా సాకుతారు. ఇప్పుడు వీధి కుక్కల విషయానికి వస్తే ఆయా వీధుల్లో రాత్రి సమయంలో రక్షణగా ఉంటాయని కొంతమంది భావిస్తారు. అయితే రాత్రి సమయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తున్న వారిపై వాటి దాడులు షరామామూలుగా మారాయి. వాటి సంతానోత్పత్తి కూడా విపరీతంగా పెరగడంతో వీధుల్లో కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. రాత్రి సమయంలో దాడులు చేసే కుక్కలు ఒంటరిగా కనిపిస్తే పగలు కూడా దాడులు చేసే పరిస్థితి నెలకొంది. కుక్కలను కంట్రోల్ చేయడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ లెక్కలు చెబుతున్న క్షేతస్థాయిలో ఆ పరిస్థితి లేదు. అయితే పెంపుడు కుక్క లేదా వీధి కుక్క దాడి చేసిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? కూడా తెలియాలి. పాఠశాల స్థాయి పుస్తకాల్లో వెనుకవైపు గతంలో కుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఫొటోలు ప్రచురించేవారు.  అయితే ప్రస్తుతం అలాంటి చర్యలు ఏమీ లేవు. కుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఓ సారి చూద్దాం.

కుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • కుక్క కరిచనప్పుడు కరచిన చోట గాయాన్ని శుభ్రంగా కడగాలి. తేలికపాటి సబ్బు నురగతో వీలుంటే వెచ్చని నీటితో గాయాన్ని కడగాలి.
  • ఒకవేళ రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డతో కట్టు కట్టుకోవాలి. 
  • మీ దగ్గర యాంటిబయోటిక్ క్రీమ్ ఉంటే గాయం వద్ద అప్లై చేయాలి.
  • అనంతరం నీటిగా కట్టు కట్టుకుని వైద్య సాయం కోసం వెళ్లాలి.
  • వైద్యుడు గాయాన్ని పరిశీలించి తగిన వైద్య సాయాన్ని అందిస్తారు. అయితే ప్రతిరోజు కట్టు మార్చుకోవాలని గుర్తుంచుకోవడం మంచిది.
  • ఎరుపు, వాపు పెరిగిన నొప్పి జ్వరం వంటి సంకేతాల వస్తే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • ముఖ్యంగా కుక్క కాటు బ్యాక్టిరియా సంక్రమణాన్ని బాగా పెంచుతుంది. కాబట్టి బ్యాక్టిరియా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..