AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahatma Gandhi Diet Plan : మహాత్మా గాంధీ డైట్ ప్లాన్ ఏంటో తెలుసా.? అది ఫాలో అయితే ఈ వ్యాధులకు చెక్ పడినట్లే..

ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరినీ ఊబకాయం సమస్య వేధిస్తుంది. కాబట్టి ఊబకాయం సమస్య నుంచి రక్షణకు చాలా మంది వివిధ ఆహార విధానాలను పాటిస్తున్నారు. ఎలాంటి విధానాలను పాటించినా బరువు తగ్గడమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది.

Mahatma Gandhi Diet Plan : మహాత్మా గాంధీ డైట్ ప్లాన్ ఏంటో తెలుసా.? అది ఫాలో అయితే ఈ వ్యాధులకు చెక్ పడినట్లే..
Gandhi Diet
Nikhil
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 23, 2023 | 4:12 PM

Share

భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడంలో మహాత్మా గాంధీ పోరాటాన్ని మరువలేము. అందుకే భారతీయులంతా జాతిపితగా ఆయనను కొలుస్తారు. భారతదేశ అభివృద్ధికి కూడా ఆయన సూచించిన ఎన్నో విషయాలను ఇప్పటికీ పాటిస్తాం. సత్యం, అహింస మార్గంలో స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ అంటే ప్రతి ఒక్కరికీ అపారమైన గౌరవం. అలాగే నిరాండంబర జీవన విధానం పాటించిన గాంధీ జీవన విధానం గురించి మీకు తెలుసా? ఆయన ప్రతిరోజూ ఏం తినేవారు? ఆయన ఆహార నియమాలు ఎలా ఉంటాయో? తెలుసా?.. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరినీ ఊబకాయం సమస్య వేధిస్తుంది. కాబట్టి ఊబకాయం సమస్య నుంచి రక్షణకు చాలా మంది వివిధ ఆహార విధానాలను పాటిస్తున్నారు. ఎలాంటి విధానాలను పాటించినా బరువు తగ్గడమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. అయితే కొంత మంది గాంధేయ జీవితం పాటిస్తే ప్రస్తుత కాలంలో చేసే డైట్‌కు కరెక్ట్‌గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. గాంధేయ జీవన విధానం శారీరకంగా చురుకుగా ఉండడంతో పాటు వీలైనంత ఎక్కువగా బహిరంగ ప్రదేశంలో నడవడం. ప్రాణాయామం సహాయంతో లయబద్ధమైన శ్వాస తీసుకోవడం, సాయంత్రం వేళల్లో సూపర్ లైట్ వ్యాయామాలు, బిజీ షెడ్యూల్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవడం, అన్నీ ప్రశాంత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బహిరంగంగా శుభ్రమైన ప్రదేశంలో నిద్రించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

గాంధేయ జీవన విధానం ఇలా

  • తగినంత గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా రోజును ప్రారంభించాలి. ఇలా చేస్తే రక్త నాళాలను విస్తరిస్తాయి. కండరాలు, అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
  • అల్లం, హెర్బల్, గ్రీన్ టీ తాగాలి. అల్లం ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మంచిది,. అల్లం కొలెస్ట్రాల్‌ను 17 శాతం తగ్గిస్తుంది. అలాగే ట్రైగ్లిజరైడ్‌లను కూడా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.
  • సీజనల్‌గా దొరికే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి . వీటన్నింటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి . అలాగే వీటిల్లో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • భోజనానికి 20 నిమిషాల ముందు ఒక గిన్నె సలాడ్ తినాలి. దీంతో శరీరానికి అవసరమైన ఫైబర్ అందడంతో పాటు ఎక్కువగా తినకుండా సాయం చేస్తుంది. 
  • మధ్యాహ్న భోజనంలో పప్పుతో పాటు మిల్లెట్ ఆధారిత రోటీని తినాలి. మీరు అన్నమే తినాలి అనుకుంటే పాలిష్ చేయడని బియాన్ని వండుకోవాలి. అలాగే భోజనంలో కచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకోవాలి.
  • సాయంత్రం సమయంలో గ్రీన్ టీ లేదా అల్లం టీని తాగాలి. అలాగే స్నాక్ కింద డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. 
  • రాత్రి భోజనం చాలా తక్కువగా తీసుకోవాలి. ఏదైనా జావ ఆధారిత భోజనం తీసుకోవడం ఉత్తమం
  • పడుకోడానికి 30 నిమిషాల ముందు జాజికాయ/యాలకులు/అల్లం/దాల్చినచెక్క కలిపిన ఒక కప్పు గోరువెచ్చని పాలను తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..