New Electric Scooter: మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓ సారి చార్జి చేస్తే చిత్తూరు నుంచి తిరుపతి వెళ్లి..వచ్చేయవచ్చు…
బెంగుళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ చూడడానికి సరికొత్తగా ఉండడంతో పాటు సెపరేట్ డిజైన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అన్ని సబ్సిడీల అనంతరం ఈ స్కూటర్ రూ.1,24,999కు (ఎక్స్ షోరూమ్) వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తుంది. పెద్ధ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ అన్నీ ఎలక్ట్రిక్ వెర్షన్లలో స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే కోవలో బెంగుళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ చూడడానికి సరికొత్తగా ఉండడంతో పాటు సెపరేట్ డిజైన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అన్ని సబ్సిడీల అనంతరం ఈ స్కూటర్ రూ.1,24,999కు (ఎక్స్ షోరూమ్) వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇండి లైఫ్‌స్టైల్ యూటిటేరియన్ స్కూటర్‌గా విక్రయించే ఈ స్కూటర్‌లో ఎదుర రెండు భారీ ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. అలాగే ఫ్లోర్ బోర్డ్ మౌంట్‌తో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే కాంబి బ్రేక్ సిస్టమ్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో 165 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అధునాతన టెయిల్ లైట్ డిజైన్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో కచ్చితంగా రోడ్డుపై వెళ్లేటప్పుడు ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ స్కూటర్ మరికొన్ని నెలల్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
135 కిలోల బరువను మోసేలా ఈ న్యూ స్కూటర్‌ను కంపెనీ డిజైన్ చేసింది. ముందు, వెనుక కూడా గాబ్రియేల్ షాక్ అబ్జార్బర్లను కంపెనీ అందిస్తుంది. ఈ స్కూటర్ 6.7 కెడబ్ల్యూ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే పీఎంఎస్ఎం మోటర్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఫ్లోర్ బోర్డ్ మౌంట్ చేసిన 4 కెడబ్ల్యూ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల మైలేజ్ వస్తుంది. అంతే ఈజీగా ఏపీలోని తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్లివచ్చేవచ్చు. అలాగే కేవలం ఐదు గంటల్లో బ్యాటరీను 0-80 శాతం వరకూ చార్జ్ చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. నీరు, డస్ట్ రెసిస్టెంట్ కోసం ఐపీ-67 సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 43 లీటర్ల అండర్ స్టోరేజీ స్పేస్ కెపాసిటితో వస్తుంది. 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ కూడా ఈ స్కూటర్ ప్రత్యేకం. అలాగే యూఎస్‌బీ చార్జింగ్ పోర్టులతో ఈ స్కూటర్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే గంటకు 90 కిలోమీటర్ల హై స్పీడ్ ఈ స్కూటర్ దూసుకుపోతుంది. అయితే ఈ స్కూటర్ బెంగుళూరు సహా కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2024కు ఇతర నగరాలకు విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..