Primus Electric Scooter: మార్కెట్‌లోకి సూపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా?

భారత్‌లో క్రమేపి పెరుగుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వెర్షన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఆంపియర్ ప్రైమస్‌లో సూపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేశారు.

Primus Electric Scooter: మార్కెట్‌లోకి సూపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా?
Primus
Follow us
Srinu

|

Updated on: Feb 18, 2023 | 3:00 PM

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం దేశంలో బాగా పెరిగింది. భారత్‌లో క్రమేపి పెరుగుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వెర్షన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఆంపియర్ ప్రైమస్‌లో సూపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేశారు. ఈ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా రూ.01,09,900 (ఎక్స్‌షోరూమ్) కు ధరకు నిర్ణయించారు. ఈ స్కూటర్‌లో వచ్చే ఇతర అధునాతన ఫీచర్లను ఓ సారి తెలుసుకుందాం.

ప్రైమస్ ఫీచర్లు ఇవే

ప్రైమస్ గరిష్ట వేగం గంటకు 77 కిలో మీటర్లు వస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఓ సారి చార్జి చేస్తే 100 కిలో మీటర్ల కంటే ఎక్కువ పరిధి అందిస్తుంది. ఎల్‌ఎఫ్‌పీ కెమిస్ట్రీతో ఎక్కువ బ్యాటరీ జీవితం, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, ఉన్నతమైన సౌలభ్యం, రైడ్‌బిలిటీని అందిస్తుంది అని కంపెనీ ప్రతినిధులు చెబుతుననారు. ఈ ఉత్పత్తి కంపెనీ మేక్-ఇన్‌ను ప్రతిబింబిస్తుంది. ఇండియా థ్రస్ట్, దేశీయంగా మూలాధారమైన భాగాలతో అధిక స్థాయి స్థానికీకరణతో ఈ స్కూటర్‌ను తయారు చేశారు. ప్రైమస్‌తో ఎలక్ట్రిక్ లాస్ట్-మైల్ మొబిలిటీ సెగ్మెంట్‌లో ఆంపియర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా, మరింత విస్తృతమైన వినియోగదారుల విభాగాలకు కూడా తయారు చేస్తామని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సంజయ్ బెహ్ల్ పేర్కొన్నారు. అలాగే కొన్ని నివేదికల ప్రకారం రాబోయే కొద్ది త్రైమాసికాల్లో రెండో ఎలక్ట్రిక్ స్కూటర్, ఆంపియర్ ఎన్‌ఎక్స్‌జీను కూడా విడుదల చేస్తోందని తెలుస్తోంది. ఈ స్కూటర్ ప్రైమస్ ప్రీమియమ్‌లో ఉంటుంది. స్టైల్, కనెక్టివిటీపై దృష్టి సారించే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్ రూపుదిద్దుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ