Tata Car Prices: టాటా కార్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన కార్ల ధరలు.. ఎంత పెరిగాయంటే..?
అయితే కార్ లవర్స్‌కు టాటా కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో అమ్మే కొన్ని మోడల్స్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే టాటా ఆల్ట్రోజ్, టాటా సఫారి, టాటా పంచ్, టాటా హారియర్, టాటా టియాగో, టాటా సఫారి కార్ల ధరలు పెంచారు.
దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా అంటే మధ్యతరగతి వాహనప్రియులకు చాలా ఇష్టం. ఎందుకంటే కార్ కొనాలనుకునే వారి ఆశను టాటా కార్లు మాత్రమే తక్కువ ధరలో తీరుస్తాయి. అందువల్ల భారతదేశంలో టాటా కంపెనీ కార్లు ఎక్కువగా అమ్ముడబోతాయి. అయితే కార్ లవర్స్‌కు టాటా కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో అమ్మే కొన్ని మోడల్స్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే టాటా ఆల్ట్రోజ్, టాటా సఫారి, టాటా పంచ్, టాటా హారియర్, టాటా టియాగో, టాటా సఫారి కార్ల ధరలు పెంచారు. ఈ కార్ల ఎక్స్‌షోరూమ్ ధరలపై గరిష్టంగా రూ.25000 పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ రెండూ వెర్షన్లపై ధరల పెంపు ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓ పక్క ఇటీవల నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టిన టాటా కంపెనీ తన పాత మోడల్స్ ధరను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మార్కెట్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.
ధరల పెరుగుదల ఇలా
టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వెర్షన్ కార్ రూ.10,000 పెరిగితే డీజిల్ వెర్షేన్ రూ.15000 పెరిగింది. టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ ఇప్పుడు రూ.10,000 పెరిగింది. టాటా టిగోర్ వేరియంట్‌ను బట్టి రూ.10,000 నుంచి రూ.15,000 వరకూ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే టాటా టియాగో పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లు కూడా రూ.15,000 వరకూ పెరిగింది. టియాగో ఎన్‌ఆర్‌జీ ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ వేరియంట్లు రూ.12,000 నుంచి రూ.15,000 వరకూ పెరిగాయి. టాటా హారియర్, టాటా సఫారీ ఎక్స్ షోరూమ్ ధర రూ.25,000 వరకూ పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..