AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తించుకోండి!

ఈ మధ్య కాలంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. దాదాపు అన్ని బ్యాంకులు కూడా హోమ్‌ లోన్‌ నుంచి పర్సనల్‌ లోన్‌ వరకు అన్ని రకాల రుణాలను తక్కువ వడ్డీతో ఆఫర్‌ ..

Personal Loan: బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తించుకోండి!
Loan
Subhash Goud
|

Updated on: Feb 18, 2023 | 3:11 PM

Share

ఈ మధ్య కాలంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. దాదాపు అన్ని బ్యాంకులు కూడా హోమ్‌ లోన్‌ నుంచి పర్సనల్‌ లోన్‌ వరకు అన్ని రకాల రుణాలను తక్కువ వడ్డీతో ఆఫర్‌ చేస్తున్నాయి. గతంలో రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగేవారు. కానీ టెక్నాలజీ మారిపోతున్న తరుణంలో ఇంట్లోనే ఉండి మొబైల్‌లో లోన్‌ కోసం అప్లై చేసుకునే సదుపాయం వచ్చేసింది. చాలా మంది హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే పర్సనల్‌ లోన్‌ కావాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి. కొందరు ఇళ్లు కొనేందుకు, మరికొందరు కార్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా డబ్బును బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

చాలా మంది వ్యక్తిగత అవసరాలు, వివాహం లేదా కుటుంబ కారణాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. చాలా మంది బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకుని ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారు. అలాంటి పని చేయడం ఖచ్చితంగా తెలివైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పర్సనల్‌ లోన్ తో స్టాక్ మార్కెట్ లాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆర్థిక సలహాదారుల ప్రకారం.. వ్యక్తిగత రుణం తీసుకోవడానికి ఎటువంటి హామీ అవసరం లేదు. అందుకే ఈ లోన్‌లపై అత్యధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇతర వాటిలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన తర్వాత ఒక వేళ నష్టపోయినట్లయితే వడ్డీతో పాటు మరింతగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. ఎవరైనా బ్యాంక్ నుండి వ్యక్తిగత రుణంతో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాల్లో పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం సరైంది కాదంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఇవి కూడా చదవండి

అనవసరంగా పర్సనల్ లోన్ తీసుకోవలసిన అవసరం లేదు. చాలా మంది కస్టమర్‌లకు ముందుగా ఆమోదించబడిన వ్యక్తిగత రుణాలను అందిస్తాయి బ్యాంకులు. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు సిబిల్‌ స్కోర్ ఆధారంగా ఈ రుణాలను అందిస్తాయి. మీరు సులభంగా 10 నుండి 15 లక్షల రూపాయల రుణాన్ని పొందవచ్చు.

రుణం లభ్యత కారణంగా అనవసరమైన రుణాలతో ఆర్థిక భారాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఈ సందర్భంలో డబ్బును నిర్దిష్ట వ్యవధిలో వడ్డీతో సహా బ్యాంకుకు తిరిగి ఇవ్వాలి. స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలు రావచ్చు.. లేదా నష్టాలు కూడా రావచ్చు. ఇందులో ఇన్వెస్ట్‌ చేసి ఎంతో మంది నష్టపోయిన వారున్నారు. కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేసేందుకు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణం పొందడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!