EPFO: ఏ సమయంలో పీఎఫ్ అకౌంట్‌ను మూసివేస్తారు..? ఖాతాలో డబ్బులు జమ కాకుంటే ఏ అవుతుంది?

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) అనేది భవిష్యత్తు కోసం ఉపయోగపడేది. ఇందులో జమ అయిన డబ్బు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పీఎఫ్‌ అకౌంట్లు..

EPFO: ఏ సమయంలో పీఎఫ్ అకౌంట్‌ను మూసివేస్తారు..? ఖాతాలో డబ్బులు జమ కాకుంటే ఏ అవుతుంది?
Epfo Account
Follow us

|

Updated on: Feb 17, 2023 | 8:00 AM

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) అనేది భవిష్యత్తు కోసం ఉపయోగపడేది. ఇందులో జమ అయిన డబ్బు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పీఎఫ్‌ అకౌంట్లు డబ్బులు జమ కాకుంటే అకౌంట్‌ క్లోజ్‌అవుతుంది. దీన్ని ఇన్‌యాక్టివ్ పీఎఫ్ ఖాతా అంటారు. వ్యక్తులు పదవీ విరమణ చేసినప్పుడ వారి పీఎఫ్‌ ఖాతాలో డబ్బు జమ చేయనప్పుడు ఇది తరచుగా జరుగుతుంటుంది. తర్వాత ఈ ఖాతాపై వడ్డీ కూడా ఆగిపోతుంది. అటువంటి పరిస్థితిలో మీ పీఎఫ్‌ అకౌంట్‌ కూడా మూసివేయబడితే, దానిపై వడ్డీ ఎంతకాలం జోడించబడుతుందో, ఎన్ని సంవత్సరాల తర్వాత వడ్డీ ఆగిపోతుందో తెలుసుకోవడం అవసరం.

పదవీ విరమణ పొందిన తర్వాత కూడా పీఎఫ్ ఖాతాలో పీఎఫ్ సొమ్ము జమ చేసినా, వేయకపోయినా వడ్డీ జమ అవుతూనే ఉంటుందనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మీరు పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లలోపు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజీనామా చేసిన 36 నెలలలోపు మీ పీఎఫ్‌ ఖాతా నుండి మీ డబ్బును ఉపసంహరించుకోకపోతే మీ ఈపీఎఫ్‌ ఖాతా నిష్క్రియం అవుతుంది. ఖాతా మూసివేయబడిన తర్వాత, దానిపై వడ్డీ కూడా ఆగిపోతుంది.

ఏ సమయంలో పీఎఫ్ అకౌంట్‌ను మూసివేస్తారు..?

☛ ఉద్యోగి 55 ఏళ్లు నిండిన తర్వాత ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి, వచ్చే మూడేళ్లలో పిఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయకపోతే

ఇవి కూడా చదవండి

☛ పీఎఫ్ సభ్యుడు విదేశాలకు వెళ్లి అక్కడ నివసించడం ప్రారంభించిన సమయంలో

☛ ఈపీఎఫ్‌ సభ్యుడు మరణిస్తే, పీఎఫ్‌ ఖాతాపై వడ్డీ అందుబాటులో ఉండదు.

☛ 58 ఏళ్లలోపు ఉద్యోగానికి రాజీనామా చేసినా, పదవీ విరమణ తీసుకున్న తర్వాత రాబోయే మూడేళ్ల వరకు డబ్బు పీఎఫ్‌ ఖాతాలో జమ చేయబడదు. అప్పుడు ఖాతా మూసివేయబడుతుంది. వడ్డీ కూడా లభించదు.

పన్ను మినహాయింపు లభించే వరకు

మీరు పదవీ విరమణ చేసే వరకు లేదా ఉద్యోగం పూర్తయ్యే వరకు మీ పీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన మొత్తానికి పన్ను ఉండదు. కానీ మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినా, పదవీ విరమణ చేసినా లేదా ఉద్యోగాన్ని పూర్తి చేసినా, ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన వడ్డీపై పన్ను విధించడం ప్రారంభమవుతుంది. మీ ఈపీఎఫ్‌ ఖాతా నిష్క్రియంగా లేదా మూసివేయబడితే, దానిలో జమ చేసిన మొత్తంపై పన్ను విధించబడుతుంది.

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వడ్డీపై పన్ను..

వరుసగా 5 సంవత్సరాలు పని చేయడానికి ముందు PF డబ్బును విత్‌డ్రా చేస్తే, ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌పై వడ్డీపై పన్ను విధించబడుతుంది. మీరు ఈపీఎఫ్‌ సభ్యత్వం పొందిన మొదటి 5 సంవత్సరాలలో ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పని చేస్తే, ఉద్యోగం రెగ్యులర్‌గా పరిగణించబడుతుంది. ఉద్యోగి మునుపటి కంపెనీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ప్రస్తుత సంస్థకు బదిలీ చేస్తే, ఆ ఉద్యోగి పన్ను ప్రయోజనాల కోసం 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతర సేవలో ఉంచినట్లు పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో పీఎఫ్‌ బ్యాలెన్స్‌పై పన్ను విధించబడదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఇదే ఫస్ట్ మదర్స్ డే..
ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఇదే ఫస్ట్ మదర్స్ డే..
నిలవాలంటే గెలవాల్సిందే.. రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై
నిలవాలంటే గెలవాల్సిందే.. రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై
హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..
హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..
ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.!
ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.!
యువ ఓటర్లు ఎవరి వైపు..? పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
యువ ఓటర్లు ఎవరి వైపు..? పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
డెత్ ఓవర్లలో డేంజరస్ బౌలర్లు వీరే.. టాప్ 5 లిస్ట్ ఇదే..
డెత్ ఓవర్లలో డేంజరస్ బౌలర్లు వీరే.. టాప్ 5 లిస్ట్ ఇదే..
పవన్ కళ్యాణ్ వద్దనుకున్న సినిమాతో హిట్టు కొట్టిన మాస్ మహారాజా..
పవన్ కళ్యాణ్ వద్దనుకున్న సినిమాతో హిట్టు కొట్టిన మాస్ మహారాజా..
ఓటర్స్ బీ అలర్ట్.. పోలింగ్‎కు ముందు ఈ ఎలక్షన్ రూల్స్‌ పాటించాలి..
ఓటర్స్ బీ అలర్ట్.. పోలింగ్‎కు ముందు ఈ ఎలక్షన్ రూల్స్‌ పాటించాలి..
విజయవాడలో పటిష్టమైన బందోబస్తు.. పెద్ద ఎత్తున పట్టుబడిన మద్యం, నగద
విజయవాడలో పటిష్టమైన బందోబస్తు.. పెద్ద ఎత్తున పట్టుబడిన మద్యం, నగద
3 రోజుల నైట్ షిఫ్ట్ మిమ్మల్నీ డయాబెటిక్ రోగిని చేయగలదు.!-అధ్యయనం
3 రోజుల నైట్ షిఫ్ట్ మిమ్మల్నీ డయాబెటిక్ రోగిని చేయగలదు.!-అధ్యయనం