- Telugu News Photo Gallery Business photos Public provident fund pay the installment by 5th of any month to get extra interest on ppf
PPF Scheme Benefits: పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా చేస్తే అదనపు ప్రయోజనం.. లేకుంటే నష్టమే
దేశంలో పొదుపునకు సంబంధించిన అనేక పెట్టుబడి పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాలు వివిధ తరగతుల ప్రజలకు లబ్ధి చేకూర్చేలా కేంద్రం అమలు చేస్తోంది. అలాంటి పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఒకటి.. భారత పౌరులు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు..
Updated on: Feb 16, 2023 | 10:25 PM

దేశంలో పొదుపునకు సంబంధించిన అనేక పెట్టుబడి పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాలు వివిధ తరగతుల ప్రజలకు లబ్ధి చేకూర్చేలా కేంద్రం అమలు చేస్తోంది. అలాంటి పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఒకటి.. భారత పౌరులు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

పదవీ విరమణ అనంతరం ఆసరా కోసం చాలా మంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఎంచుకుంటారు. మీరు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవాలి. తద్వారా మీరు తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు.


ఈ పథకంలో గరిష్ట రాబడిని పొందడానికి ప్రతి నెల 5వ తేదీలోపు డిపాజిట్ చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. నెల నెల 5వ తేదీ తర్వాత డిపాజిట్ చేస్తే ఆ నెల వడ్డీని కోల్పోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏప్రిల్ 20న పీపీఎఫ్‌లో రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే, ఆ ఆర్థిక సంవత్సరంలో అతనికి 11 నెలలు మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఫలితంగా మీరు 2023-24 సంవత్సరానికి కొంత మాత్రమే రీఫండ్ పొందుతారు. మరోవైపు అదే మొత్తాన్ని ఏప్రిల్ 5న డిపాజిట్ చేస్తే అదే కాలానికి రూ.10,650 లాభం వస్తుంది. పీపీఎఫ్ ప్రస్తుతం 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ పీపీఎఫ్‌పై ప్రభుత్వం ప్రతి సంవత్సరం వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.






























