Gold News: బంగారంపై ప్రభుత్వ తిరకాసు.. ఒక దగ్గర తీసేసి.. మరో దగ్గర వేసేశారు..

బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న పరిశ్రమల డిమాండ్‌ను ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో అందరూ సంతోషించారు. కానీ.. అది ఎక్కువ సేపు నిలబడలేదు..

Gold News: బంగారంపై ప్రభుత్వ తిరకాసు.. ఒక దగ్గర తీసేసి.. మరో దగ్గర వేసేశారు..
Gold News
Follow us
Jyothi Gadda

| Edited By: Basha Shek

Updated on: Feb 18, 2023 | 1:46 PM

బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న పరిశ్రమల డిమాండ్‌ను ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో అందరూ సంతోషించారు. కానీ.. అది ఎక్కువ సేపు నిలబడలేదు.. ఎందుకంటే.. నిర్మలమ్మ ఒకవైపు దిగుమతి సుంకాన్ని తగ్గించారు.. మరోవైపు, వ్యవసాయ సెస్ రెట్టింపు చేశారు. ఈ కారణంగా, బంగారం దిగుమతులపై మొత్తం పన్ను 15 శాతం వద్ద నుంచి ఏమాత్రం మార్పు తీసుకోలేదు. గతంలో బంగారం దిగుమతిపై 12.5 శాతం దిగుమతి సుంకం విధించారు. 2.5 శాతం వ్యవసాయ అభివృద్ధి సెస్ విడిగా విధించేవారు. అంటే, దిగుమతులపై మొత్తం 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే, ఈసారి ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించింది. మరోవైపు వ్యవసాయ అభివృద్ధి సెస్ 5 శాతానికి పెరిగింది. మొత్తం దిగుమతి సుంకం ఇంతకు ముందు లానే 15 శాతం వద్ద నిలిచింది. అయితే ఈసారి వెండి దిగుమతులపై ప్రభుత్వం పన్నును నెరుగానే పెంచింది. గతంలో వెండి దిగుమతులపై 7.5 శాతం ప్రాథమిక దిగుమతి సుంకం ఉండేది. అలాగే, 2.5 శాతం వ్యవసాయ అభివృద్ధి సెస్ కూడా విధించేవారు. దాని పైన 0.75 శాతం సాంఘిక సంక్షేమ సర్‌చార్జి కూడా ఉంది. అంటే, మొత్తం వెండి దిగుమతులపై 10.75 శాతం పన్ను విధించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వెండి పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని10 శాతానికి పెంచింది. దీనితో పాటు, వ్యవసాయ అభివృద్ధి సెస్‌ను కూడా 5 శాతానికి పెంచారు. అయితే, సాంఘిక సంక్షేమ సర్‌చార్జ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు వెండి దిగుమతులపై కూడా బంగారం మాదిరిగానే 15 శాతం పన్ను విధిస్తున్నారు.

నిజానికి, ప్రభుత్వం ముందున్న సవాలు కరెంట్ ఖాతా లోటును నియంత్రించడం. దీని కోసం, అనవసరమైన వస్తువుల దిగుమతిని అరికట్టడం ద్వారా ప్రభుత్వం తన డాలర్ల నిల్వలను ఆదా చేసుకోవాలనుకుంటోంది. 2022 లో ప్రభుత్వం దాని దిగుమతులను నియంత్రించాలనుకుంది. ఇదే కారణం, పసుపు లోహం దిగుమతితో పాటు వెండి దిగుమతులను కూడా ప్రభుత్వం ఖరీదైనదిగా చేసింది. అయితే, బంగారం, వెండి దిగుమతుల ధర పెరిగిన కారణంగా, స్మగ్లింగ్ అవకాశం కూడా పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి