Tata Motors Price Hike: వాహనదారులకు షాక్.. ఇక టాటా వాహనాలు మరింత ప్రీయం.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఫిబ్రవరి నెల నుండి కారు కొనుగోలు చేయాలంటే ఖరీదైనదిగా మారనుంది. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది..
ఫిబ్రవరి నెల నుండి కారు కొనుగోలు చేయాలంటే ఖరీదైనదిగా మారనుంది. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాహన తయారీ వ్యయం పెరగడంతో కంపెనీ ధరను పెంచబోతోందని టాటా మోటార్స్ తెలిపింది. టాటా మోటార్స్ వాహనాల ధరల పెంపు నిర్ణయం ఫిబ్రవరి 1, 2023 నుంచి అమలులోకి రానుంది.
ఫిబ్రవరి 1, 2023 నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను దాదాపు 1.2% పెంచబోతున్నట్లు టాటా మోటార్స్ తన ప్రకటనలో తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి వాహనం ధరలు పెరగనున్నాయి. వాహనాల తయారీ వ్యయం అధికం కావడమే తమ వాహనాల ధరలు పెరిగేందుకు కారణమని తెలిపింది. రెగ్యులేటరీ మార్పులు, ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం వల్ల ఖర్చు పెరిగిందని కంపెనీ చెబుతోంది. కొంత భారాన్ని కంపెనీయే భరిస్తోందని, వినియోగదారులపై కొంత భారం వేయాలని నిర్ణయించింది.
డిసెంబర్ 2022లోనే టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని సూచించింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్ ఎండి శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ధరల పెంపు వల్ల వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం తగ్గుతుందని చెప్పారు. నియంత్రణ నిబంధనల మార్పు ధరలపైనా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. బ్యాటరీల ధరలు పెరిగాయని, వినియోగదారులపై ఇంకా భారం పడలేదన్నారు. బ్యాటరీ ధరలు, కొత్త నియంత్రణ ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాలపై కనిపించిందని అన్నారు. అలాగే, కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఖర్చు కూడా పెరుగుతుందన్నారు.
కొత్త ఉద్గార నిబంధనలు 1 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం.. బీఎస్ 6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాల విక్రయాలు నిలిపివేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇంధన సామర్థ్యం, CO2 ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే మరిన్ని ఇంజిన్‌లు అందుబాటులోకి రానున్నాయి. టాటా మోటార్స్ టియాగో, పంచ్, నెక్సన్, హారియర్, సఫారీ పేర్లతో ప్యాసింజర్ వాహనాలను తయారు చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి