PAN Card Correction: మీ పాన్‌కార్డులో ఉన్న తప్పులను సరిదిద్దుకోవాలా..? ఇలా చేయండి..!

ఈరోజుల్లో ఆధార్‌ కార్డులాగే పాన్‌ కార్డు కూడా తప్పనిసరైంది. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి ఇతర లావాదేవీల వరకు పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలు ..

PAN Card Correction: మీ పాన్‌కార్డులో ఉన్న తప్పులను సరిదిద్దుకోవాలా..? ఇలా చేయండి..!
Pan Card
Follow us
Subhash Goud

|

Updated on: Jan 27, 2023 | 11:45 AM

ఈరోజుల్లో ఆధార్‌ కార్డులాగే పాన్‌ కార్డు కూడా తప్పనిసరైంది. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి ఇతర లావాదేవీల వరకు పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పాన్‌ కార్డు తప్పనిసరి చేసింది ఆదాయపు పన్ను శాఖ. అయితే భారీ మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా.. డీడీ, చలాన్‌ ఇలా లావాదేవీలకు సంబంధించి ప్రతిదానికి పాన్‌ కార్డు తప్పనిసరైంది. ఒక గుర్తింపు కార్డు కూడా పాన్ కార్డు ఉపయోగ పడుతుంది.

అయితే పాన్‌కార్డులోని వివరాలు చాలా మందికి తప్పులు ఉంటాయి. ఇంటి పేరు గానీ, అడ్రస్‌, పేరు, ఫోన్‌ నెంబర్‌ ఇలా తదితర వివరాలు తప్పులు ఉండటంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆర్థికపరమైన లావాదేవీలు సజావుగా సాగాలంటే పాన్‌ కార్డులో అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి. పాన్ కార్డులో తప్పొప్పులను, ఇతర సమస్యలను సులభంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం.. పాన్ కార్డు గ్రీవెన్స్ సర్వీసు మరింత సులభతరం చేసింది. పాన్ కార్డు దారులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ ఫిర్యాదులు చేయవచ్చు.

పొరపాట్లకు సంబంధించి ఫిర్యాదు చేయండి ఎలా?

సాధారణంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు జరిగే తప్పుల్లో ఒకటి పేరు తప్పుగా నమోదు కావడం. భారత్ అంతటా పాన్ కార్డును గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నందున.. ఏదైనా తప్పుగా నమోదైతే వెంటనే చెక్ చేసుకోవాలి. అలాగే ఒక్కోసారి పాన్ కార్డు మీద మీ ఫొటోకు బదులు మరొకరి ఫొటో రావడం, ఫొటో సరిగ్గా లేకపోయినా తదితర సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అయితే ఒక్కోసారి పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే సకాలంలో కార్డు అందకపోవచ్చు. అప్పుడు ఆ కార్డు తిరిగి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చేరుతుంది. ఒక్కోసారి అడ్రస్‌ తప్పుగా ఇవ్వడం, పేరులో తప్పుగా ఉండటం తదితర కారణాలతో వచ్చిన కార్డు అడ్రస్‌ తెలియక తిరిగి ఐటీ అధికారులకు పంపిస్తారు. అలాంటి సమయంలో అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అందులో ఏమైనా తప్పులుంటే వారికి పంపవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐటీ పోర్టల్ నుంచి ఇలా ఫిర్యాదు చేయండిలా..

ఇలాంటి సమస్యలుంటే ముందుగా ఆదాయం పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ‘పన్ను చెల్లింపుదారుల సేవలు’ అనే విభాగంపై క్లిక్ చేయాలి. ఇక్కడ ‘పాన్ గ్రీవెన్స్’ సెక్షన్‌కెళ్లాలి. కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. తర్వాత మీ కంప్లయింట్‌తోపాటు సంబంధిత సమాచారం (పేరు, పాన్ కార్డ్ నంబర్, వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్ ఐడీ) నమోదు చేసి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

టిన్ ప్రోటీన్ ఈగవ్ టెక్నాలజీ వెబ్‌సైట్‌తో ఫిర్యాదు చేయండిలా..

ముందు TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ పోర్టల్‌లోకి వెళ్లాలి. ఆ వెబ్‌సైట్‌లో కస్టమర్ కేర్ సెక్షన్ కెళ్లాలి. కంప్లయింట్స్ / క్వెరిస్ లో గల దరఖాస్తు ఫామ్ క్లిక్ చేసి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫామ్ పూర్తి చేసిన తర్వాత చివరిలో క్యాప్చా కోడ్ నమోదు చేసి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

ఆఫ్‌లైన్ ద్వారా చేయడం ఎలా…?

ఆదాయం పన్ను విభాగం హెల్ప్ డెస్క్-18001801961, TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ కాల్ సెంటర్ +91 2027218080 నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఈ-మెయిల్ ఐడీ ask@incometax.gov.inకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. పాన్ కార్డు కోసం ఫిర్యాదు చేసిన వారికి ఫిర్యాదు నంబర్ ఇస్తారు. ఆ ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి కంప్లయింట్ చేసిన పోర్టల్‌లో మీ ఫిర్యాదు నంబర్, పాన్ నంబర్ నమోదు చేస్తే.. ఫిర్యాదు స్టేటస్ తెలిసిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి