Smartphones: ఫిబ్రవరిలో విడుదల కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..!
Subhash Goud |
Updated on: Jan 27, 2023 | 7:36 AM
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో మొబైల్ తయారీ కంపెనీలు మార్కెట్లో కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి..
Jan 27, 2023 | 7:36 AM
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి నెలలో మరికొన్ని స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమీ, ఒప్పో్ వంటి కొత్త బ్రాండ్‌లు పరిచయం చేయనున్నాయి కంపెనీలు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఫ్లాగ్‌షిప్ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఫిబ్రవరిలో విడుదలయ్యే కొత్త ఫోన్లు ఏవో తెలుసుకుందాం.
1 / 5
శామ్‌సంగ్ గెలాక్సీ S23 సిరీస్: శామ్‌సంగ్ గెలక్సీ S23 సిరీస్ ఫోన్ మార్కెట్లో విడుదల కానుంది. ఫిబ్రవరి 1వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కొత్త ఈ మొబైల్‌ను విడుదల చేయనున్నారు. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ S23 అల్ట్రా ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ 13, ఆస్ట్రోఫోటోగ్రఫీ, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, బెస్ట్ డిస్‌ప్లే, OneUI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది.
2 / 5
వన్‌ప్లస్: ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వన్‌ప్లస్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11ని ఫిబ్రవరి 7న మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో ప్రీమియం గ్లాస్ శాండ్‌విచ్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది అలర్ట్ స్లైడర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్ 2K అమోలెడ్ స్క్రీన్, కస్టమ్ ఆక్సిజన్‌ఓఎస్ 13 స్కిన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
3 / 5
షియోమీ 13: షియోమీ తన తాజా 13 సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను MWC 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ షియోమీ 13, షియోమీ 13 ప్రో రెండింటినీ ప్రకటించే అవకాశం ఉంది. అత్యాధునిక ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. ఇవి స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తాయి. ఈ అన్ని స్మార్ట్‌ఫోన్లు కూడా అత్యాధునిక టెక్నాలజీనతో మంచి ఫీచర్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.
4 / 5
Oppo Find N2: గత సంవత్సరం చివరిలో చైనాలో Oppo Find N2, Oppo Find N2 ఫ్లిప్‌లతో సహా రెండు కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఒప్పో ఇంకా వివరాలను ధృవీకరించనప్పటికీ, ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో ప్రపంచవ్యాప్త లాంచ్ అవుతుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. Oppo సాంప్రదాయకంగా ఫిబ్రవరిలో దాని ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన Find X సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది.