AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న నిబంధనలు

2023 సంవత్సరం మొదటి నెల ముగియబోతోంది. ఆ తర్వాత కొత్త నెల కొత్త మార్పులతో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1 నుండి అనేక నియమాలు మారబోతున్నాయి. వీటి ప్రభావం సామాన్య ప్రజలపై కూడా..

New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న నిబంధనలు
New Rules
Subhash Goud
|

Updated on: Jan 28, 2023 | 6:49 AM

Share

2023 సంవత్సరం మొదటి నెల ముగియబోతోంది. ఆ తర్వాత కొత్త నెల కొత్త మార్పులతో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1 నుండి అనేక నియమాలు మారబోతున్నాయి. వీటి ప్రభావం సామాన్య ప్రజలపై కూడా ఉంటుంది. దీనితో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అనేక ప్రకటనలు ఉండవచ్చు. కొన్ని నియమాలు కూడా మారవచ్చు. నివేదిక ప్రకారం.. జనవరి 31 నుండి ట్రాఫిక్, ప్యాకేజింగ్, గేమింగ్, ఆదాయపు పన్ను శాఖ, వేతనానికి సంబంధించిన కొత్త నిబంధనలు ప్రారంభమవుతాయి.

ముందస్తుగా కొత్త నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం.  ఎందుకంటే ప్రతి నెల కొత్త కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు, వాహనాలు, ఆదాయానికి సంబంధించి ట్యాక్స్ విషయంలో నిబంధనలు మారుతున్నాయి.

ట్రాఫిక్ నిబంధనలలో మార్పు

ఫిబ్రవరి 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ఢిల్లీ-NCRలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు నేరుగా ఖాతా నుండి తీసివేయబడతాయి. రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు. లేన్ వెలుపల డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో వాహనదారుల జేబులకు చిల్లులుపడే అవకాశం ఉండటంతో పాటు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ కోసం కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం స్వీయ నియంత్రణ సంస్థతో నమోదు చేసుకున్న అన్ని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ సైన్ తప్పనిసరి. దీనితో పాటు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోవడం కూడా అవసరం. గేమ్‌లో పాల్గొన్న గేమర్‌ల ఉపసంహరణలు, రీఫండ్‌లు, ఫీజుల గురించిన సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ప్యాకేజింగ్ నియమాలు

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి కొత్త ప్యాకేజింగ్ నిబంధనలను అమలు చేయనుంది. కొత్త నిబంధనల వల్ల ప్రజలకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఎడిబుల్ ఆయిల్, మైదా, బిస్కెట్లు, పాలు, నీళ్లు, బేబీ ఫుడ్, సిమెంట్ బ్యాగులు, డిటర్జెంట్లు, బ్రెడ్, పప్పులు, తృణధాన్యాలు వంటి 19 రకాల వస్తువుల ప్యాకింగ్‌పై సమాచారం అందించడం తప్పనిసరి. ఇందులో మూలం దేశం, తయారీ తేదీ, బరువు ఉంటాయి.

ఆదాయపు పన్ను శాఖ నిబంధనలలో మార్పులు

జనవరి 31 తర్వాత ఆదాయపు పన్ను శాఖలోని అనేక నిబంధనలు మారవచ్చు. 2023-24 బడ్జెట్‌లో ప్రకటించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ప్రభుత్వ పథకాలపై పన్ను మినహాయింపు సౌకర్యం అందుబాటులో ఉంది, ఇందులో కూడా మార్పులు ఉండవచ్చు. 2014 సంవత్సరం నుండి, మినహాయింపు గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు. కానీ నివేదిక ప్రకారం, దీని పరిమితి రూ. 2.5 లక్షల వరకు పెరుగుతుంది. ఇది కాకుండా, గృహ రుణ మినహాయింపును కూడా పెంచాలని భావిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం:

2023 బడ్జెట్‌లో ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో పెరుగుదల ఉండవచ్చు. ప్రస్తుతం రూ.18,000గా ఉన్న కనీస వేతనం రూ.26,000కు పెంచవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి