Layoffs: ఉద్యోగులకు షాకిస్తున్న కంపెనీలు.. హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోనూ తొలగింపు షురూ..!
దేశంలో అనేక కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగాలను తొలగించగా, అదే దారిలో మరి కొన్ని కంపెనీలు వస్తున్నాయి. దానితో పాటు ఆ ఉద్యోగులకు..
దేశంలో అనేక కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగాలను తొలగించగా, అదే దారిలో మరి కొన్ని కంపెనీలు వస్తున్నాయి. దానితో పాటు ఆ ఉద్యోగులకు మరో పెద్ద సమస్య రాబోతోంది. ఈ ఉద్యోగులకు కంపెనీ అందించిన పర్సనల్ హెల్త్ కవరేజ్ ప్లాన్ ఇప్పుడు మూసివేసి అవకాశాలున్నాయి. ఉద్యోగం మానేసిన తర్వాత అటువంటి సమయంలో ఉద్యోగుల కోసం వ్యక్తిగత ఆరోగ్య కవరేజీ ప్రణాళిక గతంలో కంటే చాలా ముఖ్యమైనది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, షేర్‌చాట్, స్విగ్గితో సహా అనేక పెద్ద కంపెనీలలో తొలగింపులు జరుగుతున్నాయి. కంపెనీలు వేలాది మందిని ఉద్యోగాల నుంచి దూరం చేశాయి.
మీడియా నివేదికల ప్రకారం.. ఈ రిట్రెంచ్‌మెంట్‌లో తొలగించబడిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాగే యజమాని అందించే ఆరోగ్య బీమాను కూడా కోల్పోయారు. ఈ పరిస్థితులలో తొలగించబడిన ఉద్యోగులకు వ్యక్తిగత ఆరోగ్య కవరేజీ గతంలో కంటే చాలా ముఖ్యమైనదిగా మారింది. కరోనా మహమ్మారి కాలంలో ఆరోగ్య బీమా అనేది ముఖ్యమైనదిగా మారిపోయింది. కోవిడ్ తర్వాత చాలా మంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటున్నారు.
ఇంతకుముందు వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ సహాయంతో ఏదైనా తీవ్రమైన అనారోగ్యం లేదా ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ఆర్థిక భద్రతను పొందుతారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా అవసరం. వ్యక్తిగత ఆరోగ్య బీమా కవరేజీ లేకుండా ఏదైనా వైద్య ఖర్చుల భారాన్ని వారు స్వయంగా భరించాలి. మెటా, అమెజాన్, గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి పలు టెక్ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై నలుగురిలో ముగ్గురు ఉద్యోగాలు కోల్పోవల్సి వస్తోందని నివేదికలు వెలువడుతున్నాయి. నలుగురు భారతీయులలో ముగ్గురు ఉద్యోగాలు కోల్పోతామనే భయంతో ఉన్నారు. ఇందులో ధనిక వర్గాల్లో 32 శాతం, 36-55 ఏళ్లలోపు 30 శాతం, జీతభత్యాల తరగతిలో 30 శాతం ఉద్యో గాలున్నాయి.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి