EPIL Recruitment 2023: నెలకు రూ.70,000ల జీతంతో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. బీఈ/ బీటెక్ అర్హత
భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్.. 30 మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్.. 30 మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఎంసీఏ/బీఆర్క్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 13,2023వ తేదీ నాటికి పోస్టును బట్టి 32 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 13, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవచ్చు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.40,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.