బురద జల్లడం మానుకోండి – నారా లోకేష్
టీడీపీపై బురద జల్లేందుకు బీజేపీ, వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ ప్రతిపాదించిన 55,548 కోట్ల రూపాయలను సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో పంపిన అంచనాలను అన్నింటికి కేంద్రం ఆమోదం తెలిపింది. మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది.? అని ప్రశ్నించారు. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశం పని చేసిన చంద్రబాబు గారి […]

టీడీపీపై బురద జల్లేందుకు బీజేపీ, వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ ప్రతిపాదించిన 55,548 కోట్ల రూపాయలను సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో పంపిన అంచనాలను అన్నింటికి కేంద్రం ఆమోదం తెలిపింది. మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది.? అని ప్రశ్నించారు. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశం పని చేసిన చంద్రబాబు గారి కష్టానికి తగ్గ ఫలితమే ఈ పోలవరం ప్రాజెక్ట్ అని నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా అనవసర ఆరోపణలు చేయడం మానుకుని.. మిగిలిన 30% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై వైసీపీ నేతలు దృష్టి పెడితే మంచిది ఆయన అన్నారు.
ఇప్పటికైనా బీజేపీ వైకాపా నాయకులు తెదేపా మీద బురదజల్లడం మాని, మిగిలిన 30% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై దృష్టి పెడితే మంచిది.
— Lokesh Nara (@naralokesh) June 24, 2019
అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైకాపా డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశం చంద్రబాబుగారు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్టు.
— Lokesh Nara (@naralokesh) June 24, 2019
తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన Rs.55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడం జరిగింది. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది? pic.twitter.com/tlUPFqCuhU
— Lokesh Nara (@naralokesh) June 24, 2019




