Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price Drop: ఉల్లి ధరలు భారీగా పతనం.. రూ.2కు పడిపోయిన కిలో ధర.. అసెంబ్లీలో ఆందోళన

ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని భోరుమంటున్నాడు...

Onion Price Drop: ఉల్లి ధరలు భారీగా పతనం.. రూ.2కు పడిపోయిన కిలో ధర.. అసెంబ్లీలో ఆందోళన
Onion Price
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2023 | 11:23 AM

ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని భోరుమంటున్నాడు. దేశవ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు రైతులు.

తాజాగా ఉల్లి ధరల ఆందోళనలు మహారాష్ట్ర అసెంబ్లీని కూడా తాకాయి. ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు ఉల్లి దండలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రభుత్వమే కిలో రూ.15 నుంచి రూ.20కి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇక గుజరాత్‌లోనూ పంటకు గిట్టుబాటుధరలు లభించకపోవడంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. గుజరాత్‌లో ఉల్లికి అతిపెద్ద మార్కెట్‌ అయిన భావ్‌నగర్‌లో కిలో ఉల్లిధర కేవల 8 రూపాయలు మాత్రమే చెల్లించడంతో అన్నదాతల కష్టాలకు అంతులేకుండా పోతోంది.

ఇవి కూడా చదవండి

ఉల్లి ధరలు భారీగా పతనం కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కిలో ఉల్లి రూ.2లకు పడిపోయింది. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉల్లి ధర అంశం మహారాష్ట్ర అసెంబ్లీకి తాకడంతో సభలో రచ్చ జరుగుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లికి ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. ఎంతో పెట్టుబడి పెట్టి చివరకు నష్టాల్లో చిక్కుకుపోవడం కోలుకోలేని దెబ్బ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ.. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ.. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే..
ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే..
భారత్‌లో 7 సీట్ల కారుకు భారీ డిమాండ్.. మొదటి స్థానంలో ఏ కారు అంటే
భారత్‌లో 7 సీట్ల కారుకు భారీ డిమాండ్.. మొదటి స్థానంలో ఏ కారు అంటే
చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..