AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules From March 2023: వినియోగదారులకు అలర్ట్.. మార్చి 1 కొత్త రూల్స్‌ ఇవే.. తెలుసుకోకపోతే ఇబ్బందులే..

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలు మారుతుంటాయి...

New Rules From March 2023: వినియోగదారులకు అలర్ట్.. మార్చి 1 కొత్త రూల్స్‌ ఇవే.. తెలుసుకోకపోతే ఇబ్బందులే..
కొత్త నెల వచ్చేసింది. దానితో పాటు మన జేబు ఖాళీ చేసేందుకు న్యూ రూల్స్ కూడా అమలులోకి వచ్చేశాయ్. ముఖ్యంగా బ్యాంకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలలో మార్పులు వచ్చాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
Subhash Goud
|

Updated on: Feb 28, 2023 | 7:22 AM

Share

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలు మారుతుంటాయి. ఇక ఫిబ్రవరి నెల ముగియబోతోంది. మార్చి నెల వస్తోంది. నిబంధనలు మారడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. మరి మార్చి నెలలో ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు:

ప్రతినెల ఒకటో తేదీన ఆయిల్‌ కంపెనీలు గ్యాస్‌ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. మార్చి 1న గ్యాస్‌ సిలిండర్ ధర పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

బ్యాంకు రుణాలు:

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెంచాయి. అయితే రుణాలను నిర్ణయించే బేస్‌ రేటు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులు ప్రకటించాయి. మరి మార్చి 1 నుంచి కొంత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో సామాన్యులకు మరింత భారం కానుంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు:

ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్‌ కార్డు విభాగం ఇటీవల ఎస్‌బీఐ కార్డు కొత్త ఛార్జీలను ప్రకటించింది. పెంచిన కొత్త ఛార్జీలు మార్చి 17,2023 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఎవరైనా అద్దె చెల్లింస్తే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అదనంగా ట్యాక్స్‌ సైతం ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ.99గా ఉండేది. ఇప్పుడు డబుల్‌ చేసింది.

ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్:

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హులైన ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అధిక పెన్షన్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చింది ఈపీఎఫ్‌వో. దీంతో చందాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మార్చి 3, 2023 చివరి గడువుగా పేర్కొంది. ఎవరైనా అర్హులుగా ఉంటే గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.

సోషల్‌ మీడియా ఫిర్యాదులు:

ఇక సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు మూడు ఫిర్యాదులు అప్పీలేట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీలు మార్చి 1వ తేదీ నుంచి పని చేయనున్నాయి. ఈ కమిటీలు సోషల్ మీడియాలకు సంబంధించిన ఫిర్యాదులను కేవలం 30 రోజుల్లోనే పరిష్కరించనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్