సౌదీ అరేబియాలో మరో అద్భుత కట్టడం.. మెస్మరైజ్ చేస్తున్న డిజైన్ !!
సౌదీ అరేబియా.. సుసంపన్న దేశం. అకాశాన్నంటే నిర్మాణాలతో, భారీ ప్రాజెక్టులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటుంది.. ఈ క్రమంలో తాబేలు ఆకారంలో భారీ ఓడను నిర్మించి..
సౌదీ అరేబియా.. సుసంపన్న దేశం. అకాశాన్నంటే నిర్మాణాలతో, భారీ ప్రాజెక్టులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటుంది.. ఈ క్రమంలో తాబేలు ఆకారంలో భారీ ఓడను నిర్మించి.. దాన్ని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. దానికి పాంజియోస్ అనే పేరు కూడా పెట్టింది. తాజాగా మరో అబ్బురపరిచే నిర్మాణానికి సౌదీ ప్లాన్ చేసింది. రాజధాని నగరం రియాద్ లో ‘ముకాబ్’ పేరుతో అతి భారీ కట్టడానికి ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ భారీ నిర్మాణం.. మక్కాలోని పవిత్ర ‘కాబా’ ను తలపిస్తోంది. 400 మీటర్ల ఎత్తయిన ఈ బిల్డింగ్ క్యూబ్ ఆకారంలో ఉంటుంది. ఇది న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 20 రెట్లు పెద్దది. ఇందులో మ్యూజియం, టెక్నాలజీ అండ్ డిజైన్ యూనివర్సిటీ, మల్టీ పర్పస్ థియేటర్, మరో 80కిపైగా కల్చరల్, ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు వంటివి ఏర్పాటు కానున్నాయి. ‘‘ఈ భారీ నిర్మాణాన్ని 2030 నాటికల్లా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నట్టు టూరిజం సంస్థ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాషింగ్ మెషీన్ లోని సబ్బునీళ్లలో 15 ని.లపాటు తిరిగిన యేడాదిన్నర చిన్నారి !! చివరికి ??
దెబ్బకు దిగివచ్చిన HCA !! ఎన్టీఆర్ ఫ్యాన్సా.. మజాకా..
Koratala Siva: రాజమౌళి కారణంగా చిక్కుల్లో కొరటాల శివ !!
RC15: క్రేజీ అప్డేట్ !! RC15 ఫస్ట్ లుక్ లోడింగ్ !!
Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత !! నెట్టింట వైరల్
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

