Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ మారాయ్.. ఇకపై స్టాప్ లైన్ దాటినా భారీగా జరిమానా విధింపు..
రోడ్డు ప్రమాదాల నివరాణకు అధికారులు ట్రాఫ్రిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఇకపై హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేసే వాహనదారులకు భారీగా..
రోడ్డు ప్రమాదాల నివరాణకు అధికారులు ట్రాఫ్రిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఇకపై హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేసే వాహనదారులకు భారీగా జరిమానాలు విధించనున్నారు. అలాగే అతివేగం, సిగ్నల్ రూల్స్ పాటించకపోయిన జేబుకు చిళ్లుపడటం ఖాయమంటున్నారు తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు. ఈ మేరకు చెన్నై నగరవ్యాప్తంగా పోలీసులు గస్తీ పనులు చేపట్టి రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై భారీగా కేసులు నమోదుచేసి, భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తున్నారు.
సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడితే వాహనదారులు తమ వాహనాలను ‘స్టాప్ లైన్’కు ముందు నిలుపుతారు. ఒక్కోసారి గీత దాటిన తర్వాత రెడ్‌లైట్ పడితే అక్కడే వేచిఉండవల్సి వచ్చేది. ఐతే అధికమంది గీత దాటి ముందుకొస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గమనించారు. ఫలితంగా ఇతర మార్గాల్లో వెళ్లే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిపై కూడా ట్రాఫిక్ పోలీసులు గట్టి నిఘా వేశారు. సిగ్నల్ పడినప్పుడు స్టాప్‌లైన్‌ను దాటి ముందుకెళ్లిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక్క సోమవారం నాడే చెన్నైలోని 150 ప్రధాన సిగ్నళ్ల వద్ద 3,702 కేసుల నమోదయ్యాయి. సీసీ కెమెరాల ద్వారా స్టాప్ లైన్ దాటిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.