Indian Army: దటీజ్ ఇండియన్ ఆర్మీ.. గల్వాన్‌లో క్రికెట్ ఆడిన జవాన్లు.. వైరల్ అవుతున్న ఫోటోలు..
తూర్పు లద్ధాఖ్‌పై పట్టు బిగిస్తోంది భారత్. చైనాకు ధీటుగా నిఘా పెంచింది. తూర్పు లద్దాఖ్‌లోకి చొరబడి భారత్‌ను అణిచివేయాలన్న డ్రాగన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ.
తూర్పు లద్ధాఖ్‌పై పట్టు బిగిస్తోంది భారత్. చైనాకు ధీటుగా నిఘా పెంచింది. తూర్పు లద్దాఖ్‌లోకి చొరబడి భారత్‌ను అణిచివేయాలన్న డ్రాగన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. తమ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. అటువైపు నుంచి చైనా కవ్విస్తున్న నేపథ్యంలో తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ ఫోర్స్ పెంచింది. ఈ క్రమంలోనే.. ఆర్మీ జవాన్లు లద్ధాఖ్‌లో సరదాగా క్రికెట్ ఆడారు.
తూర్పు లద్ధాఖ్‌లో భారత్ సైన్యం క్రికెట్ ఆడుతున్న ఫొటోలను షేర్ చేసింది. ఇండియన్ ఆర్మీ 14 కార్ప్స్ ఈ చిత్రాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామంటూ..డ్రాగన్‌కు వార్నింగ్ ఇచ్చింది.
మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంలో.. పటియాలా బ్రిగేడ్ త్రిశూల్ డివిజన్ ఈ క్రికెట్ పోటీలను నిర్వహించింది. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశామంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన 14 కార్ప్స్ ట్విట్టర్‌లో ఫొటోలు రిలీజ్ చేసింది. గల్వాన్ ఘటన తర్వాత ఇరుదేశాల ఉన్నతాధికారులు చర్చలు జరిపి బఫర్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతానికి సమీపంలోనే ఇండియన్ ఆర్మీ క్రికెట్ ఆడినట్టు తెలుస్తోంది.
#Patiala Brigade #Trishul Division organised a cricket competition in extreme high altitude area in Sub zero temperatures with full enthusiasm and zeal. We make the Impossible Possible@adgpi @NorthernComd_IA pic.twitter.com/0RWPPxGaJq
— @firefurycorps_IA (@firefurycorps) March 3, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..