Metro Rail Services: మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

నగరంలోని మెట్రో రైలే సర్వీసుల్లో శుక్రవారం (మార్చి 3) ఉదయం పీక్‌ అవర్స్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా..

Metro Rail Services: మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
Metro Rail
Follow us

|

Updated on: Mar 04, 2023 | 8:36 AM

చెన్నై నగరంలోని మెట్రో రైలే సర్వీసుల్లో శుక్రవారం (మార్చి 3) ఉదయం పీక్‌ అవర్స్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా చెన్నై సెంట్రల్‌ నుంచి కోయంబేడు మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్ళే మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సెంట్రల్‌ నుంచి కోయంబేడు మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్ళే మార్గంలో అలందూరు సమీపంలోని సిగ్నలింగ్ సిస్టమ్‌లోని ఒక భాగంలో లోపం తలెత్తింది. ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్ళే రైళ్ళు సెయింట్‌ థామస్‌ మౌంట్‌ వరకు మాత్రమే నడిచాయి. చెన్నై సెంట్రల్-చెన్నై విమానాశ్రయం మధ్య డైరెక్ట్ రైళ్లు నిలిచిపోయాయి.

దీంతో కోయంబేడు మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్ళే ప్రయాణికులు అలందూరు మెట్రో స్టేషన్‌లో దిగి అక్కడ నుంచి అన్నాసాలై మీదుగా వచ్చే మెట్రో రైళ్ళలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవల్సి వచ్చింది. మధ్యాహ్నానికి పరిస్థితి మెరుగుపడటంతో రైళ్లరాకపోకలు యథాప్రకారం కొనసాగాయి. కాగా గతంలో (ఫిబ్రవరి 27) కూడా చెన్నై మెట్రో సర్వీసుల్లో సాంకేతిక లోపం తలెత్తింది. కోయంబేడు నుంచి సెంట్రల్ మెట్రో స్టేషన్ వరకు రైలు సాంకేతిక సమస్య కారణంగా తిరుమంగళం సమీపంలో ఆగిపోయింది. రైలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. తరచూ మెట్రో సర్వీసుల్లో ఏర్పడుతోన్న అంతరాయాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles