అదిరిపోయే ఆఫర్.. ‘ఒకటి కొంటే రెండు బీర్లు ఫ్రీ’.. దుకాణానికి పోటెత్తిన జనం.. కట్ చేస్తే.. పరుగో పరుగు..
బిజినెస్‌లో సక్సెస్ కావాలనుకున్నాడు.. ఏకంగా బీర్లనే ఆఫర్ చేశాడు.. చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.. తన వ్యాపారాన్ని ఒక్కసారిగా పెంచుకోవాలనుకున్న స్మార్ట్ ఫోన్ షాపు యజమాని అరెస్ట్ అయ్యాడు.

బిజినెస్‌లో సక్సెస్ కావాలనుకున్నాడు.. ఏకంగా బీర్లనే ఆఫర్ చేశాడు.. చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.. తన వ్యాపారాన్ని ఒక్కసారిగా పెంచుకోవాలనుకున్న స్మార్ట్ ఫోన్ షాపు యజమాని అరెస్ట్ అయ్యాడు. తన షాపులో ఫోన్లు కొన్నవారికి ఉచితంగా రెండు బీర్లు ఫ్రీగా ఇస్తానని వ్యాపారి ప్రకటించాడు. దీనికోసం ప్రచారం కూడా నిర్వహించాడు. ఇదే అతడి కొంప ముంచింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో బుక్కయ్యాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో బదోహీ జిల్లాలకు చెందిన రాజేశ్ మౌర్య ఓ స్మార్ట్ ఫోన్ షాపు నిర్వహిస్తున్నారు. అమ్మకాలు పెంచుకునే వ్యూహంలో భాగంగా అతను ఉచిత బీర్ల ఆఫర్ ను ప్రకటించాడు. మార్చి 3 నుంచి 7వ తేదీల మధ్య తన షాపులో ఫోన్లు కొన్నవారికి రెండు బీర్ బాటిళ్లను ఉచితంగా ఇస్తానని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాడు. ఈ మేరకు కరపత్రాలను కూడా ప్రింట్ చేసి పంచాడు.
దీంతో.. జనం నుంచి భారీ స్పందన వచ్చింది. ఆయన షాపునకు జనం పొటెత్తారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అతని ఆఫర్‌కు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అక్కడున్న గుంపును చెదరగొట్టి మౌర్యను ఐపీసీ సెక్షన్ 151 కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.




దుకాణాన్ని కూడా సీల్ చేసినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ సేథ్ తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో వెంటనే రంగంలోకి దిగినట్లు ఆయన పేర్కొన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 151 (ప్రజా శాంతికి భంగం కలిగించడం) కింద మౌర్యను అరెస్టు చేసినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




