‘రాహుల్‌ గాంధీకి పిల్లలు పుట్టరు.. అందుకే ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు’.. బీజేసీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని సోమవారం (మార్చి 6) కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ..

'రాహుల్‌ గాంధీకి పిల్లలు పుట్టరు.. అందుకే ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు'.. బీజేసీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Rahul Gandhi
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 07, 2023 | 12:40 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని సోమవారం (మార్చి 6) కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటిల్ వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నళిన్ కుమార్ సోమవారం జరిగిన జన సంకల్ప యాత్రలో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని అది వేయించుకుంటే పిల్లలు పుట్టరని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య (కర్నాటక మాజీ ముఖ్యమంత్రి) ప్రచారం చేశారు. కానీ వాళ్లు మాత్రం కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టే రాహుల్ గాంధీ వివాహం చేసుకోలేదని, ఈ విషయాన్ని మా ఎమ్మెల్సీ మంజునాథ్ నిన్న నాతో అన్నారు’ అంటూ వ్యాఖ్యానించారు.

బీజేసీ నేత నళిన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ‘చూడబోతే బీజేపీలో అందరికీ ఉన్నట్లు నళినీ కుమార్‌కు కూడా తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యాధి అతని పార్టీ మొత్తానికి వ్యాపించేటట్లు ఉంది. త్వరగా కోలుకో బీజేపీ’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం అధినేత ప్రియాంక్ ఖర్గే ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. మరోవైపు నళిన్‌ కుమార్ వ్యాఖ్యలపై సొంత పార్టీ సైతం అసహనం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కె సుధాకర్ స్పందిస్తూ ‘మా అధ్యక్షుడు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు, వాటిని పట్టించుకోవల్సిన అవసరం లేదు’అని పేర్కొన్నారు. కాగా గత నెలలో కటీల్ తన పార్టీ కార్యకర్తలను ‘రోడ్లు, మురుగు వంటి చిన్న సమస్యలపై కాకుండా లవ్ జిహాద్’ వంటి సమస్యలపై దృష్టి పెట్టాలని నళిని కుమార్‌ పిలుపునివ్వడం పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.