AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viagra – Alcohol: ఫుల్‌గా మద్యం తాగి రెండు వయాగ్రా ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు.. చివరకు ఊహించని ట్విస్ట్

లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొంతమంది వయాగ్రా ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు.. అయితే, ఈ ట్యాబ్లెట్లు సెక్స్ డ్రైవ్ ను పెంచేందుకుదోహదపడతాయి.. కానీ.. వీటిని వైద్యుల సూచనల ప్రకారమే..

Viagra - Alcohol: ఫుల్‌గా మద్యం తాగి రెండు వయాగ్రా ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు.. చివరకు ఊహించని ట్విస్ట్
Viagra Alcohol
Shaik Madar Saheb
|

Updated on: Mar 07, 2023 | 12:57 PM

Share

లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొంతమంది వయాగ్రా ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు.. అయితే, ఈ ట్యాబ్లెట్లు సెక్స్ డ్రైవ్ ను పెంచేందుకుదోహదపడతాయి.. కానీ.. వీటిని వైద్యుల సూచనల ప్రకారమే తీసుకోవాలని మరోసారి నిరూపితమైంది. ఓ వ్యక్తి మద్యంతో రెండు వయాగ్రా ట్యాబ్లెట్లను తీసుకున్నాడు.. ఆ తర్వాత మరణించాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఓ 41 ఏళ్ల వ్యక్తి మద్యం సేవిస్తూ రెండు వయాగ్రా మాత్రలు వేసుకుని మరణించాడని.. జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ news.au.com నివేదించింది. జర్నల్ లో ప్రచురితమైన కేస్ స్టడీలో.. మరణించిన ఆ వ్యక్తి ఒక హోటల్‌లో మహిళతో కలిసి గడిపాడు. ఈ సమయంలో వయాగ్రా బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న సిల్డెనాఫిల్ అనే రెండు 50mg టాబ్లెట్‌లను వేసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. గణనీయమైన వైద్య, శస్త్రచికిత్స చరిత్ర తెలియకుండా ఆ సమయంలో మద్యం సేవిస్తున్నట్లు తెలిపారు. అలా మద్యం సేవిస్తూనే రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకుని.. హోటల్ లో మహిళతో కలిసి గడిపాడాని వైద్యులు తెలిపారు.

ఆ మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతతకు గురయ్యాడు. వాంతులు బాగా అవుతుండటంతో ఆ వ్యక్తి స్నేహితురాలు హోటల్ సిబ్బందికి వైద్య సహాయం కోరింది. అయినప్పటికీ, అతను ఆమె ఆందోళనలను తోసిపుచ్చాడు. అతను అంతకుముందు కూడా ఇలాంటి లక్షణాలను అనుభవించినట్లు ఆమెకు చెప్పాడు

అయితే, ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి తీసువచ్చేలోపే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అధ్యయనం ప్రకారం, మనిషి మెదడుకు ఆక్సిజన్ డెలివరీ తగ్గిపోయినప్పుడు.. సెరెబ్రోవాస్కులర్ హెమరేజ్‌తో మరణించాడని తేలింది.

ఇవి కూడా చదవండి

“గత వైద్య, శస్త్రచికిత్స చరిత్ర లేని 41 ఏళ్ల పురుషుడు ఒక మహిళా స్నేహితుడితో హోటల్ గదిలో ఉంటున్నాడు.. అతను రాత్రి 2 సిల్డెనాఫిల్ (ఒక్కొక్కటి 50 mg) వేసుకుని ఆల్కహాల్ తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం, అతను అసౌకర్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు” అని అధ్యయనం పేర్కొంది.

పోస్ట్‌మార్టం స్కానింగ్‌లో 300 గ్రాముల రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఆల్కహాల్, మందుల మిశ్రమం, అలాగే ముందుగా ఉన్న అధిక రక్తపోటు అతని మరణానికి దారితీసిందని వైద్యులు నిర్ధారించారు. వైద్య సలహా లేకుండా అంగస్తంభన (వయాగ్రా) మందులను తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ అరుదైన కేసును ప్రచురించినట్లు అధ్యయన రచయితలు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..