IDBI Recruitment 2023: 89 వేల జీతం.. 114 పోస్టులు.. దరఖాస్తుకు వారమే టైమ్.. త్వరపడండి..

IDBI బ్యాంక్ SO, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ వారంలో ముగియనుంది. IDBI స్పెషలిస్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12, 2023..

IDBI Recruitment 2023: 89 వేల జీతం.. 114 పోస్టులు.. దరఖాస్తుకు వారమే టైమ్.. త్వరపడండి..
Idbi Recruitment 2023
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 09, 2023 | 12:25 PM

IDBI బ్యాంక్ SO, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ వారంలో ముగియనుంది. IDBI స్పెషలిస్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12, 2023.. అభ్యర్థులు idbibank.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ భాగంగా ఐడీబీఐ బ్యాంకు 114 పోస్టులను భర్తీ చేయనుంది.

IDBI రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు..

  • మేనేజర్: 75 పోస్టులు
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 29 పోస్టులు
  • డిప్యూటీ జనరల్ మేనేజర్: 10 పోస్టులు

IDBI రిక్రూట్‌మెంట్ 2023 అప్లికేషన్ ఫీజు..

జనరల్, EWS, OBC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే SC/ST కేటగిరీ అభ్యర్థులకు రూ. 200 ఫీజు.

IDBI రిక్రూట్‌మెంట్ 2023 పే స్కేల్:

  • డిప్యూటీ జనరల్ మేనేజర్: గ్రేడ్ ‘డి’ రూ. 76010-2220 (4) – 84890-2500 (2) -89890 (7 సంవత్సరాలు)
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్: గ్రేడ్ ‘సి’ రూ. 63840-1990(5) – 73790-2220(2) – 78230 (8 సంవత్సరాలు)
  • మేనేజర్: గ్రేడ్ ‘బి’ రూ. 48170-1740(1) – 49910-1990(10) – 69810 (12 సంవత్సరాలు)

IDBI రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్‌లో, సపోర్ట్‌గా అప్‌లోడ్ చేసిన పత్రాలలో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, పని అనుభవం మొదలైన నిర్ణీత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ప్రాథమిక స్క్రీనింగ్‌ కొనసాగుతుంది.

ప్రిలిమినరీ స్క్రీనింగ్ తర్వాత, విద్యా అర్హతలు, పలు పత్రాల ధృవీకరణ ప్రకారం పోస్ట్‌లు/గ్రేడ్‌లకు అర్హతను నిర్ధారిస్తారు. అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఐడీబీఐ అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది.

ఎలా దరఖాస్తు చేయాలి:

అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్‌సైట్ idbibank.in (careers) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

మొత్తం వివరాల కోసం ఈ కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి..

IDBI రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.