PSBs Vacancies: పీఎస్‌బీల్లో భారీగా ఖాళీలు.. ఏ బ్యాంకుల్లో ఎన్ని ఉన్నాయంటే?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI )లో మాత్రం ప్రస్తుతం 8,544 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 3,448 ఆఫీసర్ స్థాయిలో, 1,400 సబ్ స్టాఫ్ స్థాయిలో ఉన్నాయి. ఎస్‌బీఐ బ్యాంకులో మంజూరైన పోస్టుల సంఖ్య 2.47 లక్షలుగా ఉంది.

PSBs Vacancies: పీఎస్‌బీల్లో భారీగా ఖాళీలు.. ఏ బ్యాంకుల్లో ఎన్ని ఉన్నాయంటే?
Follow us

|

Updated on: Dec 16, 2021 | 8:22 AM

Public Sector Banks Vacancies: డిసెంబర్ 1 నాటికి 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) 41,177 ఖాళీలు ఉన్నాయని లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే 8.06 లక్షల పోస్టులు మంజూరయ్యాయని లోక్‌సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.

పీఎస్‌బీల నుంచి అందిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 1, 2021 నాటికి మంజూరైన పోస్టులలో దాదాపు 95 శాతం పూర్తయ్యాయని సీతారామన్ తన ప్రకటనలో తెలిపారు. ” ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీల నిష్పత్తి గణనీయంగా తగ్గిందని” అని ఆమె అన్నారు. గత ఆరు సంవత్సరాలలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒక పోస్ట్ మినహా(2016లో పంజాబ్ & సింధ్ బ్యాంక్) ఏ పోస్ట్/ఖాళీని రద్దు చేయలేదు. బ్యాంకులు వారి అవసరాలకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయడానికి సిబ్బంది నియామకాన్ని చేపడుతున్నాయి.

ఇక అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI )లో మాత్రం ప్రస్తుతం 8,544 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 3,448 ఆఫీసర్ స్థాయిలో, 1,400 సబ్ స్టాఫ్ స్థాయిలో ఉన్నాయి. ఎస్‌బీఐ బ్యాంకులో మంజూరైన పోస్టుల సంఖ్య 2.47 లక్షలుగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PNB ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వరుసగా 6,743 మరియు 6,295 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

SBI, PNB రెండు అతిపెద్ద పీఎస్‌బీలుకాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (PCA) ఫ్రేమ్‌వర్క్‌లో మిగిలి ఉన్న ఏకైక రుణదాతగా సెంట్రల్ బ్యాంక్ నిలిచింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో పీసీఏ నుంచి నిష్క్రమించిన కోల్‌కతాకు చెందిన UCO బ్యాంక్ కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలను కలిగి ఉంది. ఇందులో 3,727 ఖాళీలు ఉండగా, మంజూరైన పోస్టుల సంఖ్య 25,280గా ఉంది.

Also Read: Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో 365 అంగన్‌వాడీ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

BEL Recruitment: బెల్‌, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..