TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
TS Inter Results: కరోనా కారణంగా రద్దు చేసిన తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇంటర్ బోర్డ్ తిరిగి నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు..
TS Inter Results: తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనుంది. అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డ్ మరికాసేపట్లో విడుదల చేయనుంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈరోజు (డిసెంబర్ 16) ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఇందులో భాగంగా ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్కోర్ కార్డులో విద్యార్థులు సాధించిన మార్కుల జాబితా ఉంటుంది. ఒక వేళ ఫలితాలు విడుదలైన వెంటనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే సర్వర్ బిజీ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయంగా మరో వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. examresults.ts.nic.in వెబ్‌సైట్‌లోకి కూడా వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఉచిత తాగునీటి పథకం గడువు పొడిగింపు