Omicron Variant: ఏడేళ్ల బాలుడికి పాజిటివ్.. హైదరాబాద్ నుంచే పయనం.. దేశంలో హడలెత్తిస్తున్న ఒమిక్రాన్..
Omicron Variant: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పిల్లలు సైతం ఈ కొత్త వేరియంట్ బారిన పడుతుండటం ఆందోళన రేపుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో
Omicron Variant: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పిల్లలు సైతం ఈ కొత్త వేరియంట్ బారిన పడుతుండటం ఆందోళన రేపుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బెంగాల్ ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఈ ఏడేళ్ల బాలుడు తల్లిదండ్రులతో కలిసి అబుదాబి నుంచి డిసెంబర్ 10న హైదరాబాద్ మీదుగా బెంగాల్ ముర్షిదాబాద్ కు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. అనంతరం బాలుడు కుటుంబం.. బెంగాల్ కు పయనమైంది. బాలుడి నుంచి సేకరించిన నమూనాలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరిక్షలో ఓమిక్రాన్ వేరియంట్‌ను చూపించినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే.. బాలుడి తల్లిదండ్రులకు ఒమిక్రాన్ నిర్ధారణ కాలేదని.. వారికి వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు బెంగాల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో బాలుడిని ముర్షిదాబాద్ జిల్లాలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు బెంగాల్ అధికారులు వెల్లడించారు.
కాగా.. అంతకుముందు తెలంగాణలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఒమిక్రాన్ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కెన్యా, సోమాలియాకు చెందిన ఇద్దరికీ ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.
ఇదిలాఉంటే.. పశ్చిమ బెంగాల్‌లో ధృవీకరించిన కేసుతో భారతదేశంలో ఇప్పటివరకు ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 64 కి చేరింది.
Also Read: