AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robbery: హాలీవుడ్ సినిమాను తలపించిన భారీ దోపిడి.. డ్రైనేజ్ పగులగొట్టి.. ఏసీ పైప్‌ల నుంచి దూరి..

Massive robbery in Vellore district: తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. హాలీవుడ్ సినిమా స్టైల్ లో కోట్లలో బంగారం, వజ్రాలు దోపిడీ చేశారు. ఈ భారీ దోపిడీ ఘటన వేలూరులోని

Robbery: హాలీవుడ్ సినిమాను తలపించిన భారీ దోపిడి.. డ్రైనేజ్ పగులగొట్టి.. ఏసీ పైప్‌ల నుంచి దూరి..
Robbery
Shaik Madar Saheb
|

Updated on: Dec 15, 2021 | 7:10 PM

Share

Massive robbery in Vellore district: తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. హాలీవుడ్ సినిమా స్టైల్ లో కోట్లలో బంగారం, వజ్రాలు దోపిడీ చేశారు. ఈ భారీ దోపిడీ ఘటన వేలూరులోని జోస్ అలుకాస్ నగల దుకాణంలో చోటుచేసుకుంది. మురుగు కాలువ ద్వారా వజ్రాలు, బంగారు ఆభరణాల దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో నిఘా కెమెరాలన్నింటినీ స్ప్రే చేసి దుండగులు అత్యాధునికంగా దొంగతానానకి పాల్పడ్డారని వేల్లూర్ పోలీసులు తెలిపారు. జోస్ అలుకాస్ జ్యువెలరీ షాపు.. వెల్లూరు జిల్లా కేంద్రంలోని కాట్పాడి రోడ్డులో ఉంది. ఉదయం యథావిధిగా సిబ్బంది దుకాణం తెరిచి షాక్‌కు గురయ్యారు. దుకాణం వెనుక ఉన్న మురుగు కాలువను పగులగొట్టి దుండగులు.. సెల్లార్‌ ద్వారా నగల దుకాణంలోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. కాంప్లెక్స్‌లో ఉన్న ఏసీ పైప్ ల ద్వారా ప్రవేశించిన దొంగలు సుమారు 35 కిలోల వజ్రాలు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు యాజమాన్యం పేర్కొంది. నగల దుకాణంలో ఉంచిన కెమెరాలపై స్ప్రే కొట్టడంతో దొంగల చిత్రాలను ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నారు.

సంఘటనా స్థలాన్ని వేలూరు పోలీస్ డిప్యూటీ చీఫ్ బాబు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కన్నా పరిశీలించారు. స్నిఫర్ డాగ్ ద్వారా అన్వేషణ కొనసాగుతోంది. ఈ ఘటన అనంతరం దుకాణంలోని ఉద్యోగుల నుంచి కూడా పోలీసులు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ షాపులో పనిచేస్తున్న ఉద్యోగులంతా రెండో అంతస్తులో ఉంటున్నారు. ప్రధాన రహదారిపై నలుగురు కాపలా ఉన్నప్పటికీ దోపిడీ జరగడం గమనార్హం. షాప్ మొత్తం సెంట్రల్ ఏసీ కావడంతో గాలి బయటికిపోవడానికి పెద్ద పైప్ లను ఏర్పాటు చేశారు. వాటి నుంచి దుండగులు షాపులోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. కోట్లాది రూపాయల దోపిడి జరిగిందని పోలీసులు తెలిపారు. అంతకుముందు తిరుచ్చిలోని లలితా జ్యూయలరీలో ఇదే విధంగా దోపిడీ జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

Also Read:

RTC Bus Accident: తృటిలో తప్పిన మరో పెను ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

YS Jagan: పదికి చేరిన జల్లేరు మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన