YS Jagan: పదికి చేరిన జల్లేరు మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Jangareddygudem Accident: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ వంతెన రెయిలింగ్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు
Jangareddygudem Accident: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ వంతెన రెయిలింగ్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు వాగులో పడిన ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
కాగా.. బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ సహా 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరొకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: