Shilpa Chaudhary: కిట్టీ పార్టీల కిలేడీ శిల్పా చౌదరికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు!

కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. శిల్ప చౌదరి బెయిల్‌ ప్రయత్నం ఫలించలేదు. బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ఉప్పరపల్లి కోర్టు.

Shilpa Chaudhary: కిట్టీ పార్టీల కిలేడీ శిల్పా చౌదరికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు!
Shilpa Chowdhury
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 15, 2021 | 2:16 PM

Shilpa Chaudhary bail petition: కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. శిల్ప చౌదరి బెయిల్‌ ప్రయత్నం ఫలించలేదు. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఉప్పరపల్లి కోర్టు.. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. నార్సింగ్ పోలీసులు చంచల్ గూడ జైలు నుంచి ఆమెను తీసుకెళ్లి గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. శిల్ప బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన కోర్టు.. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో శిల్పను తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు.

చిట్టీలు మొదలు.. కిట్టీ పార్టీల వరకు అనేక రంగాల్లో వేలు పెట్టిన శిల్పపై అనేక ఆరోపణలున్నాయి. తమకు ఎక్కువ మొత్తాల్లో డబ్బులు చెల్లించాలంటూ అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా నోరు విప్పలేదు శిల్ప. పోలీసుల కంటే అడ్వాన్స్‌గా ఆలోచించిన శిల్పా, అసలు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడింది. శిల్పాచౌదరిని బ్యాంకుకు తీసుకెళ్లారు పోలీసులు. అక్కడ అమెకు సంబంధించిన లాకర్‌ ఓపెన్‌ చేసి అవాక్కయ్యారు. అందులో డబ్బు, బంగారం ఏమీ లేవు. ఏదో ఉన్నాయని ఊహించిన పోలీసులకు నిరాశే ఎదురైంది. దీంతో చేసేదేం లేక, శిల్పాచౌదరిని తిరిగి SOT కార్యాలయానికి తరలించారు.

Read Also…. తల్లిదండ్రులకు హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు చాలా ప్రమాదం..