Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులకు హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు చాలా ప్రమాదం..

Pneumonia: చలికాలం వచ్చిందంటే పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వస్తాయి. ఇవి ఎక్కువ రోజులు ఉంటే న్యుమోనియాకు కారణమవుతాయి.

తల్లిదండ్రులకు హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు చాలా ప్రమాదం..
Child
Follow us
uppula Raju

|

Updated on: Dec 15, 2021 | 2:00 PM

Pneumonia: చలికాలం వచ్చిందంటే పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వస్తాయి. ఇవి ఎక్కువ రోజులు ఉంటే న్యుమోనియాకు కారణమవుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో పిల్లలను గమనిస్తూ ఉండాలి. న్యుమోనియా అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధి కారణంగా, ఊపిరితిత్తులలో బ్యాక్టీరియా, వైరస్ స్థిరపడుతుంది. ఊపిరితిత్తుల వాపు, ఊపిరితిత్తులోచీము లేదా ఇతర ద్రవాలు చేరుతాయి. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

పిల్లలలో న్యుమోనియా నిర్ధారణ ఎలా? ‘పిల్లల్లో న్యూమోనియా లక్షణాలను అంచనా వేయలేము. గుర్తించడానికి క్లినికల్ పరీక్షలు అవసరం. తల్లిదండ్రుల నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. ఊపిరితిత్తులలో ద్రవం ఉందా లేదా అనేది ముందుగా తనిఖీ చేస్తారు. ఎక్కువగా ఛాతీ ఎక్స్-రే ద్వారా న్యుమోనియా గుర్తిస్తారు. ఇది కాకుండా రక్త పరీక్ష ద్వారా కూడా తెలుస్తుంది. రక్తంలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ పరిమాణం కనుగొంటారు. దీంతో పాటు చాలా సార్లు వైద్యులు కఫం పరీక్ష కొన్ని సందర్భాలలో ఛాతీ CT స్కాన్ చేస్తారు. న్యుమోనియా చాలా దశలలో విస్తరించి ఉంటుంది.

లక్షణాలు ఏమిటి? లక్షణాల గురించి మాట్లాడినట్లయితే రోగి దగ్గు, శ్వాస ఆడకపోవడం, జ్వరం, చలి లేదా వణుకు, వేగంగా శ్వాస తీసుకోవడం, వాంతులు, తలనొప్పి, తినాలనే కోరిక కోల్పోవడం, ఛాతీ లేదా కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటాడు. న్యుమోనియా పరీక్షల ద్వారా మాత్రమే నిర్దారణ అవుతుంది. కానీ సాధారణ జలుబు-జ్వరం, న్యుమోనియా లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. న్యుమోనియాలో అధిక జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, ఆకలి మందగించడం, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం/శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ జలుబులో ఇవేమి కనిపించవు.

Indian Coast Guard 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో పోస్టులు..

JNVST 2022: నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు నేడే ఆఖరు తేది.. అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి..

IGNOU July Admission 2021: ఇగ్నో యూజీ, పీజీ కోర్సులలో చేరడానికి నేడే చివరితేది..