AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: ఆస్ట్రేలియా ప్రధానికి కరోనా పాజిటివ్.. దక్షిణ కొరియా అధ్యక్షుడి సహా 1000 మందిలో ఆందోళన

Corona Virus: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో అతనికి కరోనా సోకినట్లు తెలిసింది. గత వారం..

Corona Virus: ఆస్ట్రేలియా ప్రధానికి కరోనా పాజిటివ్.. దక్షిణ కొరియా అధ్యక్షుడి సహా 1000 మందిలో ఆందోళన
Australian Pm Scott
Surya Kala
|

Updated on: Dec 15, 2021 | 12:12 PM

Share

Corona Virus: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో అతనికి కరోనా సోకినట్లు తెలిసింది. గత వారం శుక్రవారం సిడ్నీ పాఠశాల వేడుకకు మారిసన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 1000 మంది హాజరయ్యారు. అయితే… ఈ కార్యక్రమం తర్వాత స్కాట్ మోరిసన్‌ కోవిడ్ -19 కరోనా పరీక్షలు నిర్ధారించగా రెండుసార్లు నెగెటివ్ గా రిజల్ట్ వచ్చింది. చివరికి NT-PCR పరీక్షలో పాజిటివ్ గా తేలింది.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ని కలిసిన అనంతరం ప్రధాన మంత్రికి స్కాట్ కు కరోనా ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ అయిందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. అయితే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రధానికి కరోనా వైరస్ సోకడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం ఏమవుతుంది. సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్  లో క్రమంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.  బుధవారం ఇక్కడ 1,360 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది ఒక రోజు ముందు నమోదైన 804 కేసుల కంటే 50 శాతం ఎక్కువ.

మూన్ జే-ఇన్  

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ కోవిడ్ పాజిటివ్, వ్యాధి సోకడానికి ముందు పాఠశాల కార్యక్రమానికి హాజరై, దక్షిణ కొరియా అధ్యక్షుడిని కూడా కలిశారు. పాఠశాల కార్యక్రమంలో బాలుర బృందంతో ప్రధాని ఫోటో దిగారు.  అదే సమయంలో సోమవారం సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధాని మంగళవారం రాత్రి కిర్రిబిల్లి హౌస్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశానికి ముందు ఆయన న్యూ సౌత్ వేల్స్ హెల్త్,  చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో సంప్రదింపులు జరిపారు.

క్వీన్స్‌లాండ్‌ను సందర్శించనున్న ప్రధాని: 

స్కాట్ మోరిస్ మంగళవారం మెల్‌బోర్న్‌లోని డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లారు.  ఇక బుధవారం క్వీన్స్‌లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే  ఇప్పటికే ప్రధానికి కరోనా వ్యాధి సోకినట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడు ప్రధానితో గత కొన్ని రోజులుగా కలిసిన వ్యక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పెరుగుతున్న వైరస్ ముప్పు మధ్య, కోవిడ్ -19 లాక్‌డౌన్ వల్ల ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. దాదాపు రెండేళ్ల నిషేధం అనంతరం బుధవారం సరిహద్దులు తెరిచారు.

Also Read:  పానకాల లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న బాలయ్య, బోయపాటి.. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు…

Follow Us
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే