IGNOU July Admission 2021: ఇగ్నో యూజీ, పీజీ కోర్సులలో చేరడానికి నేడే చివరితేది..
IGNOU July Admission 2021: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జూలై అడ్మిషన్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియను
IGNOU July Admission 2021: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జూలై అడ్మిషన్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేటితో (డిసెంబర్ 15న) ముగుస్తుంది. ఇంకా వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే ignou.ac.inలోని IGNOU అధికారిక సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అంతకుముందు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 12 వరకు ఉండేది. దీనిని డిసెంబర్ 15 వరకు పొడిగించారు. జూలై 2021 సెషన్ కోసం సర్టిఫికేట్/డిప్లొమా, PG డిప్లొమా ప్రోగ్రామ్‌లకు ఇప్పటికే అడ్మిషన్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. 1. ignouadmission.samarth.edu.inలో IGNOU సమర్థ్ అధికారిక సైట్‌ని సందర్శించండి 2. లాగిన్ వివరాలను నమోదు నమోదు చేయండి. 3. దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. 4. అప్లికేషన్ ఫీజు చెల్లించండి. 5. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓకె బటన్‌పై క్లిక్ చేయండి. 6. మీ దరఖాస్తు ప్రక్రియ అయిపోతుంది. 7. పేజీని డౌన్‌లోడ్ చేయండి తదుపరి అవసరాల ప్రింట్ తీసుకోండి. 8. అడ్మిషన్ సమయంలో మొదటి సెమిస్టర్/సంవత్సరం ప్రోగ్రామ్ ఫీజుతో పాటుగా 200/- వసూలు చేస్తారు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు IGNOU అధికారిక సైట్‌ని తనిఖీ చేయవచ్చు.
IGNOU UG లేదా PG అడ్మిషన్ కోసం దరఖాస్తు ఫారమ్ నింపే సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే IGNOU మీ కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా జారీ చేసింది. వాటిని తెలుసుకోండి. 1. 011-29572513 2. 011-29572514 ఇది కాకుండా మీరు IGNOU ఈమెయిల్ ఐడి ssc@ignou.ac.inకి మెయిల్ చేయడం ద్వారా కూడా సంప్రదించవచ్చు. విశ్వవిద్యాలయం వివిధ విభాగాలలో 200 కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. వీటిలో మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, పిజి డిప్లొమా, డిప్లొమా, పిజి సర్టిఫికెట్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు, అవగాహన స్థాయి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అన్ని కార్యక్రమాల గురించి సమాచారాన్ని ignouadmission.samarth.edu.in ని సందర్శించడం ద్వారా తనిఖీ చేయవచ్చు.