Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాడి పరిశ్రమ కోసం స్టార్టప్ పోటీలు.. గెలిచిన వారికి 10 లక్షలు.. రన్నరప్‌కి 7లక్షలు..

Animal Husbandry: భారతదేశంలో అతిపెద్ద ఉపాధిని కల్పించే రంగాలలో పాడి పరిశ్రమ ఒకటి. దీన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు

పాడి పరిశ్రమ కోసం స్టార్టప్ పోటీలు.. గెలిచిన వారికి 10 లక్షలు.. రన్నరప్‌కి 7లక్షలు..
Rupee
Follow us
uppula Raju

|

Updated on: Dec 15, 2021 | 9:57 AM

Animal Husbandry: భారతదేశంలో అతిపెద్ద ఉపాధిని కల్పించే రంగాలలో పాడి పరిశ్రమ ఒకటి. దీన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ రంగాన్ని వ్యవస్థీకృతం చేయడానికి, లాభాలను పెంచడానికి దీని అనుబంధ పరిశ్రమల ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. స్టార్టప్‌లను ఈ రంగానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక పోటీని నిర్వహిస్తోంది. ఇందులో స్టార్టప్‌లు 6 విభిన్న సవాళ్లను ఎదుర్కొంటాయి. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానించారు.

ఈ పోటీ ఏమిటి డెయిరీ మంత్రిత్వ శాఖ ‘యానిమల్ హస్బెండరీ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్’ రెండో ఎడిషన్‌ను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. పశుపోషణ, పాడి పరిశ్రమకు సంబంధించిన 6 ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి వినూత్న ఆలోచనలను కనుగొనడం దీని లక్ష్యం. ఈ ఛాలెంజ్ మొదటి ఎడిషన్‌ను ప్రధాని మోదీ సెప్టెంబర్ 2019లో ప్రారంభించారు. ఈ ప్రచారం సహాయంతో ఆధునిక సాంకేతికతలపై పనిచేసే యువ వ్యాపారవేత్తలను ఈ రంగానికి వచ్చేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

ఈ సవాళ్లు ఏమిటి జంతువుల సంఖ్యను పెంచడం, గుర్తింపు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, పాల సరఫరాను నిర్ధారించడానికి, నాణ్యతను మెరుగుపరచడానికి కోల్డ్ స్టోరేజీలను సృష్టించడం మొదలైనవి ఉంటాయి. మీరు పాడి పరిశ్రమతో అనుబంధం కలిగి ఉండి ఏదైనా ఆలోచనతో పని చేస్తుంటే మీరు www.startupindia.gov.inని సందర్శించడం ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

విజేత ఏమి పొందుతాడు మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పోటీలో 6 సవాళ్లు ఉన్నాయి. ఇందులో గెలిచిన ఒక్కో విజేతకు రూ.10 లక్షల నగదు బహుమతి, రన్నరప్‌కు రూ. 7 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. దీంతో పాటు వారు తమ ఆలోచనలను ప్రభుత్వం, పెట్టుబడిదారుల ముందు ఉంచడానికి అవకాశం పొందుతారు. ఇవన్నీ వృద్ధి చెందడానికి ఇంక్యుబేషన్ సమయం కేటాయిస్తారు. 3 నెలల ప్రిపరేషన్ తర్వాత 9 నెలల పాటు స్టార్టప్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. దీంతో పాటు ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికి మంత్రిత్వ శాఖ నిపుణులను కూడా నియమిస్తుంది.

ఇంటర్‌ తర్వాత ఈ కోర్సు చేస్తే త్వరగా జాబ్‌.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మెరుగైన అవకాశాలు..

NIFTలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి..

చలికాలంలో బాడీలో ఇది లేకపోతే ఎర్రటి అరటిపండు తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..