Google: ఉద్యోగులకు షాక్‌నిచ్చిన గూగుల్‌.. వ్యాక్సినేషన్‌ చేయించుకోపోతే జాబ్‌లో ఉండరు..

Google: కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించుకోనందుకు గూగుల్‌ కంపెనీ ఉద్యోగులపై ఫైర్‌ అయింది. అంతేకాదు జాబ్‌లో నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

Google: ఉద్యోగులకు షాక్‌నిచ్చిన గూగుల్‌.. వ్యాక్సినేషన్‌ చేయించుకోపోతే జాబ్‌లో ఉండరు..
Google
Follow us

|

Updated on: Dec 15, 2021 | 8:44 AM

Google: కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేయించుకోనందుకు గూగుల్‌ కంపెనీ ఉద్యోగులపై ఫైర్‌ అయింది. అంతేకాదు జాబ్‌లో నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. CNBC నివేదికల ప్రకారం.. Google ఉద్యోగులు కోవిడ్-19 టీకా నియమాలను పాటించకపోతే తొలగిస్తామని, వారి జీతం కూడా జప్తు చేస్తామని ప్రకటించిందని తెలిపింది. Google మేనేజ్‌మెంట్ జారీ చేసిన మెమోరాండం ప్రకారం.. ఉద్యోగులు టీకా వేసుకున్నారా లేదా తెలపడానికి రుజువు చూపించాలని, వ్యాక్సినేషన్ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. అంతేకాదు ఎవరైనా వైద్య, మతపరమైన మినహాయింపుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3 వరకు సమయం కేటాయించింది.

CNBC నివేదిక ప్రకారం.. డిసెంబర్ 3 నాటికి తమ టీకా పరిస్థితిని అప్‌లోడ్ చేయని ఉద్యోగులను సంప్రదించడం ప్రారంభిస్తామని గూగుల్ తెలిపింది. టీకాలు వేయించుకోని ఉద్యోగులు ఇంకా ఎటువంటి సమాధానం చెప్పని ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తామని పేర్కొంది. జనవరి 18 నాటికి టీకా నియమాలను పాటించని ఉద్యోగులు 30 రోజుల పాటు “చెల్లింపుతో కూడిన పరిపాలనా సెలవు”లో ఉంటారు. ఆ తర్వాత అతను ఆరు నెలల పాటు ‘వేతనం లేని వ్యక్తిగత సెలవు’లో ఉంటారు. ఆ తర్వాత వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారని CNBC నివేదించింది.

6 నుంచి 7 నెలల సమయం నివేదిక ప్రకారం.. నిబంధనలు పాటించని వ్యక్తులను 30 రోజులు సెలవుపై పంపుతారు. ఈ సమయంలో వారికి జీతం వస్తుంది. దీని తర్వాత వారు 6 నెలల సెలవుపై ఉంటారు. ఈ సమయంలో వారు ఎటువంటి జీతం పొందలేరు. నిబంధనలు పాటించకుంటే ఆ తర్వాత ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 53 లక్షల మంది కరోనా కారణంగా మరణించారు. అదే సమయంలో 27 కోట్ల మంది ప్రజలు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డారు. అయితే ఈ మహమ్మారిని ఓడించడంలో 24 కోట్ల మంది ప్రజలు విజయం సాధించారు.

రోజుకు 20 రూపాయలు డిపాజిట్‌ చేస్తే కోటీశ్వరులు కావొచ్చు.. డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి

చాణక్య నీతి: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆచార్య చెప్పిన ఈ 4 విషయాలు ఎప్పుడు మర్చిపోకండి..

Skin Care Tips: ముఖం నిగారింపు కోసం సహజసిద్దమైన 5 పద్దతులు.. ఏంటో తెలుసుకోండి..