Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 20 రూపాయలు డిపాజిట్‌ చేస్తే కోటీశ్వరులు కావొచ్చు.. డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి

Mutual Funds: ప్రతి ఒక్కరూ డబ్బు ఆదా చేయాలని, బ్యాంకు ఖాతాలో కోట్లు ఉండాలని కోరుకుంటారు. అయితే మధ్యతరగతి ప్రజలకు పరిమిత

రోజుకు 20 రూపాయలు డిపాజిట్‌ చేస్తే కోటీశ్వరులు కావొచ్చు.. డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి
Rupee
Follow us
uppula Raju

|

Updated on: Dec 15, 2021 | 8:16 AM

Mutual Funds: ప్రతి ఒక్కరూ డబ్బు ఆదా చేయాలని, బ్యాంకు ఖాతాలో కోట్లు ఉండాలని కోరుకుంటారు. అయితే మధ్యతరగతి ప్రజలకు పరిమిత ఆదాయం, ఖర్చుల కారణంగా వారు పెద్దగా పొదుపు చేయలేరు. కానీ మీరు రోజుకు 20 రూపాయలు ఆదా చేస్తే రిటైర్మెంట్‌ తర్వాత సులభంగా కోటీశ్వరులవుతారు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మిలియనీర్ కావాలనే మీ కల నెరవేరుతుంది. ఇందులో రోజూ రూ.20 ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.10 కోట్లు సమీకరించవచ్చు.

అయితే మీకు సరైన పెట్టుబడి ప్రణాళిక అవసరం. మ్యూచువల్ ఫండ్స్ గురించి మీ అందరికీ తెలుసు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మీరు ప్రతి నెలా కనీసం రూ. 500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ 25 ఏళ్లలో అద్భుతమైన రాబడిని ఇచ్చాయి. మీరు 20 సంవత్సరాల వయస్సు నుంచి రోజుకు రూ.20 ఆదా చేస్తే ఈ మొత్తం నెలకు రూ.600 అవుతుంది.

మీరు ఈ పెట్టుబడిని 40 ఏళ్లపాటు కొనసాగించాలి. అంటే 480 నెలలకు మీరు ప్రతి నెలా 600 రూపాయలు పెట్టుబడి పెడుతారు. ఈ పెట్టుబడిపై మీకు 15 శాతం వార్షిక రాబడి లభిస్తుంది. 40 ఏళ్ల తర్వాత మీకు మొత్తం రూ.1.88 కోట్లు లభిస్తాయి. ఈ 40 ఏళ్లలో కేవలం రూ.2,88,000 మాత్రమే పెట్టుబడి పెడుతారు. మీరు ఒక నెలలో రూ. 600 SIPపై 20% రాబడిని పొందినట్లయితే 40 సంవత్సరాల తర్వాత, మొత్తం రూ. 10.21 కోట్లు అవుతుంది.

ఇది కాకుండా మీరు 20 సంవత్సరాల వయస్సులో ప్రతిరోజూ రూ. 30 ఆదా చేస్తే అది నెలకు రూ.900 అవుతుంది. మీరు SIP ద్వారా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే ఈ పెట్టుబడిపై 40 సంవత్సరాల తర్వాత మీరు సంవత్సరానికి 12% రాబడి చొప్పున రూ. 1.07 కోట్లు పొందుతారు. ఈ సమయంలో రూ.4,32,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి మార్కెట్ అడ్వైజర్ సహాయం తప్పనిసరిగా తీసుకోవాలని గుర్తుంచుకోండి.

కాంపౌండింగ్ అంటే మీరు పెట్టుబడిపై సంపాదించిన ఆదాయాన్ని తిరిగి పెట్టుబడి పెట్టడం. ఇందులో మీరు మొత్తంపై వడ్డీతో పాటు దానిమొత్తంపై కూడా వడ్డీని పొందుతారు. మీ పెట్టుబడిని పెంచడానికి కాంపౌండింగ్‌ ఒక గొప్ప మార్గం. మీరు చిన్న వయస్సు నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తేనే మీరు కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. అదే సమయంలో 5 లేదా 10 సంవత్సరాలకు బదులుగా మీరు 20 లేదా 25 సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకోవాలి. పెట్టుబడిని ఎంత ఎక్కువ కాలం ఉంచితే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

చాణక్య నీతి: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆచార్య చెప్పిన ఈ 4 విషయాలు ఎప్పుడు మర్చిపోకండి..

Skin Care Tips: ముఖం నిగారింపు కోసం సహజసిద్దమైన 5 పద్దతులు.. ఏంటో తెలుసుకోండి..

UGC: యూనివర్సిటీ, కాలేజీలలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారా..! యూజీసీ ఏం చెబుతోంది..?