Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leena Nair: మరో అంతర్జాతీయ సంస్థకు బాస్ గా భారతీయ మహిళ .. ‘చానెల్‌’ సీఈవోగా లీనా నాయర్‌..

గూగుల్‌, ట్విట్టర్‌, మైక్రోసాఫ్ట్‌, మాస్టర్ కార్డ్, అడోబ్, ఐబీఎమ్‌, పెప్సీకో.. ఇలా ప్రపంచంలోని టాప్‌ కార్పొరేట్‌ కంపెనీలన్నింటికీ భారతీయులే బాస్‌గా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మరొకరు చేరారు. ఫ్రాన్స్ కు చెందిన

Leena Nair: మరో అంతర్జాతీయ సంస్థకు బాస్ గా భారతీయ మహిళ .. 'చానెల్‌' సీఈవోగా లీనా నాయర్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 8:46 AM

గూగుల్‌, ట్విట్టర్‌, మైక్రోసాఫ్ట్‌, మాస్టర్ కార్డ్, అడోబ్, ఐబీఎమ్‌, పెప్సీకో.. ఇలా ప్రపంచంలోని టాప్‌ కార్పొరేట్‌ కంపెనీలన్నింటికీ భారతీయులే బాస్‌గా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మరొకరు చేరారు. ఫ్రాన్స్ కు చెందిన గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ సంస్థ ‘చానెల్‌’ సీఈవోగా భారత సంతతికి చెందిన లీనా నాయర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె లండన్ కేంద్రంగా ఉన్న మరోఇంటర్నేషనల్‌ కన్జ్యూమర్‌ కంపెనీ యూనీలీవర్ సంస్థలో సీహెచ్‌ఆర్‌వో (చీఫ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ ఆఫీసర్‌) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఫ్రాన్స్‌కు చెందిన చానెల్‌ ప్రపంచంలోనే టాప్‌ ఫ్యాషన్‌ బ్రాండ్లలో ఒకటి. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ బిలియనీర్‌ అలెన్‌ వెర్తిమీర్ స్థాపించిన ఈ సంస్థ ఏటా లక్షల కోట్ల టర్నోవర్‌ సాధిస్తోంది. కాగా లీనా నాయర్‌ వచ్చే ఏడాది జనవరి నుంచి చానెల్‌ సీఈవో బాధ్యతలు స్వీకరించనున్నారు.

30 ఏళ్ల అనుభవం.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పుట్టి పెరిగింది లీనా నాయర్. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆతర్వాత సాంగ్లీలోని వాల్‌చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్ట్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఆపై జంషెడ్‌పూర్‌లోని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (XLRI)లో బంగారు పతకంలో మేనేజ్‌మెంట్‌ డిగ్రీ అందుకుంది. ఇక సుమారు మూడు దశాబ్దాల క్రితం అంటే1992లో హిందూస్థాన్‌ యూనీలివర్‌ కంపెనీ(HUI)లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ప్రారంభించారు లీనా. తన పనితీరుతో ఆ సంస్థలో పలు కీలక పదవులను అలంకరించారు. ఇండియాలో బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రలోని పలు HUI యూనిట్లలో ఆమె విధులు నిర్వహించారు. 1996లో ఎంప్లాయ్ రిలేషన్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. 2000లో హిందుస్థాన్ లివర్ ఇండియా HR మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2004లో జనరల్ మేనేజర్ హోదాకు ఎదిగారు . ఇక 2016 నుంచి లండన్ ప్రధాన కార్యాలయంలో సీహెచ్‌ఆర్‌వో కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారు.

గర్వంగా చెప్పుకుంటాను! కాగా ఛానెల్‌ సంస్థలకు సీఈవోగా నియమితురాలైన 52 ఏళ్ల లీనా నాయర్‌.. ఈ హోదా దక్కించుకున్న మొదటి మహిళ, అతిపిన్న వయస్కురాలు కావడం విశేషం. అంతేకాదు ఆసియా సంతతికి చెందిన వ్యక్తులు ఈ బాధ్యతలు స్వీకరించడం కూడా ఇదే తొలిసారి. ‘నేను 30 ఏళ్లుగా హిందూస్థాన్‌ యూనీలీవర్‌ సంస్థలో పనిచేస్తున్నాను. ఈ సంస్థ నాకెంతో కీలక పదవులను, గుర్తింపును ఇచ్చింది. జీవితంలో మరింత ఎత్తుకు ఎదిగేందుకు అవకాశం కల్పించింది. అందుకు సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యూనీలీవర్‌ ఉద్యోగినని చెప్పుకునేందుకు నేను ఎప్పుడూ గర్వపడుతాను. ఇక చానెల్‌ సీఈవోగా నియమితురాలైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన అత్యుత్తమ గౌరవంగా భావిస్తున్నాను. సంస్థలో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంచుతూ, సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను ‘ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు లీనానాయర్‌. కాగా చానెల్‌ సీఈవోగా నియమితురాలైన ఆమెకు పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

View this post on Instagram

A post shared by Leena Nair (@leenanairhr)

View this post on Instagram

A post shared by Leena Nair (@leenanairhr)

Also Read:

Bigg Boss 5 Telugu: నాడు మెగాస్టార్.. ఈసారి మెగా పవర్‌స్టార్‌.. బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా రామ్‌చరణ్‌!

Bus Fire Accident: ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు.. ఆకతాయిల పనా? మావోయిస్టుల దుశ్చర్యా..?

Andhra Pradesh: ఆ సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం.. రైతులకు చేకూరనున్న ప్రయోజనం

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!