AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loans: అత్యవసరంగా డబ్బులు కావాలా.. ఇస్తానంటున్న SBI.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా..?

SBI Loans: దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Personal Loans: అత్యవసరంగా డబ్బులు కావాలా.. ఇస్తానంటున్న SBI.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా..?
Sbi
Balaraju Goud
|

Updated on: Dec 15, 2021 | 6:56 AM

Share

SBI Pre Approved Loans: దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకు కోసం మరోసారి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్షణం వ్యక్తిగత రుణాలు పొందడానికి SBI ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ (PAPL)ను ప్రవేశపెట్టింది. SBI YONO యాప్ ద్వారా ఈ సేవను పొందవచ్చు. అత్యవసరంగా డబ్బులు అవసరం వచ్చినప్పుడు యోనో యాప్‌లో నాలుగు క్లిక్‌లతో పర్సనల్ లోన్ అందించనున్నట్లు SBI పేర్కొంది. PAPL 24 గంటలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటుందని SBI తెలిపింది. ముందస్తు సమాచారం ఆధారంగా కస్టమర్లను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా మంచి క్రెడిట్ హిస్టరీతో ఉన్న వాళ్లను ఎంపిక చేసి లోన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇకపై డాక్యుమెంట్లు, ఎంక్వరీలు లేకుండానే నేరు ఖాతాదారుల అకౌంట్లు జమ చేయనున్నట్లు పేర్కొంది.

ఆసక్తిగల SBI కస్టమర్‌లు 567676కు “PAPL” అని మెసేజ్ చేయడం ద్వారా ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లకు అర్హులు కాదా అని చెక్ చేసుకోవచ్చు. పండుగ సందర్భంగా SBI మరో ఆఫర్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ ప్రకారం లోన్ తీసుకోవాలనుకునే వారు వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. YONO యాప్ ద్వారా అన్నీ ఆన్‌లైన్‌లో పూర్తవుతాయి. కాబట్టి భౌతిక డాక్యుమెంటేషన్‌ను సమర్పించాల్సిన అవసరం లేదు. రుణాలపై వడ్డీ రేటు 9.60 శాతం నుంచి ప్రారంభమవుతుందని SBI ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది ఇతర వ్యక్తిగత రుణాల కంటే తక్కువ.

PAPL లోన్ ఎలా పొందవచ్చో కింద తెలుసుకోండి..

1. MPin లేదా పాస్‌వర్డ్‌తో స్మార్ట్‌ఫోన్‌లోని YONO యాప్‌లో లాగిన్ అవ్వండి 2. డ్రాప్-డౌన్ మెను పై క్లిక్ చేసి, ‘అవైల్ నౌ’ ఎంచుకోండి. 3. లోన్ మొత్తం, కాలవ్యవధిని ఎంచుకోండి. 4. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేశాకా, ఎంచుకున్న మొత్తం మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

Read Also….  Viral Video: వివాహ వేడుకలో వధూవరులు అత్యుత్సాహం.. గాలిలోకి 4 రౌండ్ల కాల్పులు.. పోలీసుల ఎంట్రీతో..