Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC: యూనివర్సిటీ, కాలేజీలలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారా..! యూజీసీ ఏం చెబుతోంది..?

UGC Notice Fake: కరోనా కాలంలో విశ్వవిద్యాలయాలలో నిర్వహించాల్సిన పరీక్షల గురించి UGC నోటీసు చర్చలో నిలిచింది. అన్ని యూనివర్సిటీల్లో

UGC: యూనివర్సిటీ, కాలేజీలలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారా..! యూజీసీ ఏం చెబుతోంది..?
Ugc 2021
Follow us
uppula Raju

|

Updated on: Dec 14, 2021 | 2:45 PM

UGC Notice Fake: కరోనా కాలంలో విశ్వవిద్యాలయాలలో నిర్వహించాల్సిన పరీక్షల గురించి UGC నోటీసు చర్చలో నిలిచింది. అన్ని యూనివర్సిటీల్లో ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని ఈ నోటీసులో పేర్కొంది. ఇప్పుడు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తన నిజాన్ని బయటపెట్టింది. UGC తన అధికారిక వెబ్‌సైట్ ugc.ac.inలో కొత్త నోటీసును జారీ చేసింది. దీంతో పాటు తన ట్విట్టర్ హ్యాండిల్ @ugc_indiaలో పోస్ట్‌ను షేర్‌ చేసింది. ఇందులో ముఖ్య సమాచారం అందించింది.

నోటీసులో ఏముంది.. UGC వెబ్‌సైట్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నోటీసులో డిసెంబర్ 10, 2021 నాటి నోటీసు అనేక ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చింది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఆఫ్‌లైన్‌లో మాత్రమే పరీక్ష నిర్వహించాలని యూజీసీ సెక్రటరీ ఆదేశించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. కానీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) అటువంటి నోటీసును జారీ చేయలేదని తెలిపింది.వాస్తవానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) తనిఖీ చేసి డిసెంబర్ 10 నోటీసు నకిలీగా తేల్చింది. అలాగే ఏదైనా నోటీసు లేదా సమాచారాన్ని కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ ugc.ac.inలో అప్‌లోడ్ చేయాలని సూచించింది. నిజమైన సమాచారం కోసం మీరు UGC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాలి. మరొక నోటీసులో UGC అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, అనుబంధ సంస్థలు COVID ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఆదేశించింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి యుజిసి నిరంతరం ఉన్నత విద్యా సంస్థలకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తూనే ఉందని కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించి అన్ని మార్గదర్శకాలు, సలహాలు 29 ఏప్రిల్ 2020 నుంచి 16 జూలై 2021 వరకు జారీ చేసింది. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని ఉన్నత విద్యా సంస్థలు కోవిడ్ -19 నుంచి రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

వామ్మో ఇదేం పిచ్చి..! ‘మంత్రగత్తె’గా మారిన 27 ఏళ్ల యువతి.. ఎందుకో తెలుసా..?

నిశ్చితార్థం తర్వాత అమ్మాయి, అబ్బాయి ఈ 4 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.. లేదంటే..?

Ola Electric Scooter: ఓలా బుకింగ్‌ దారులకు గుడ్ న్యూస్‌.. డిసెంబర్‌ 15 నుంచి డెలివరీ ప్రారంభం..