వామ్మో ఇదేం పిచ్చి..! ‘మంత్రగత్తె’గా మారిన 27 ఏళ్ల యువతి.. ఎందుకో తెలుసా..?

Goth Look Girl: ప్రతి అమ్మాయి అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. అందుకోసం చాలా ఖర్చు కూడా చేస్తుంది. కానీ ఒక అమ్మాయి

వామ్మో ఇదేం పిచ్చి..! 'మంత్రగత్తె'గా మారిన 27 ఏళ్ల యువతి.. ఎందుకో తెలుసా..?
Goth Look Girl
Follow us

|

Updated on: Dec 14, 2021 | 2:08 PM

Goth Look Girl: ప్రతి అమ్మాయి అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. అందుకోసం చాలా ఖర్చు కూడా చేస్తుంది. కానీ ఒక అమ్మాయి భయంకరంగా కనిపించడం కోసం కష్టపడుతుంది. మంత్రగత్తెలా కనిపించడానికి ఇష్టపడుతుంది. ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ నిజం. అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన ఈ అమ్మాయి ఎప్పుడూ నల్లని దుస్తులతో వింత మేకప్‌తో జీవిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మాయి మేకోవర్ చేయడంతో చూపరులు కూడా నమ్మలేకపోయారు. మంత్రగత్తె లాంటి రూపం వెనుక ఇంత అందమైన ముఖం దాగి ఉందా అంటూ ఆశ్చర్యపోయారు.

ఈ 27 ఏళ్ల యువతి పేరు జోర్డాన్ బౌవీ. జోర్డాన్ సంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె చిన్నప్పటి నుంచి వింతగా జీవించడానికి ఇష్టపడుతుంది. కుటుంబ సభ్యులు తప్ప, బయటి ప్రపంచంలోని వ్యక్తులు ఆమెను సాధారణ రూపంలో చూడలేదు. జోర్డాన్ తల్లి, సోదరి చాలా అందంగా ఉంటారు కాబట్టి జోర్డాన్ కూడా అందంగా కనిపిస్తుంది. అయితే బయట వారికి మాత్రం ఆమె మంత్రగత్తె అని మాత్రమే తెలుసు. వెబ్‌సైట్ డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. ఇటీవల జోర్డాన్ ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ సహాయంతో తన స్టైల్‌ మార్చేసింది.

జోర్డాన్ శరీరంపై ఉన్న అన్ని పచ్చబొట్లు తొలగించింది. సిల్వర్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతుంది. ఆమె హెయిర్‌స్టైల్‌ కూడా మార్చేసింది. తమాషా ఏమిటంటే ఈ మేకోవర్ తర్వాత జోర్డాన్ తన కుటుంబ సభ్యుల ముందుకు తీసుకురాగా వారు కూడా నమ్మలేకపోయారు. మేక్ఓవర్ తర్వాత జోర్డాన్ తల్లి, సోదరి కంటే అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఈ మొత్తం మేకోవర్‌పై జోర్డాన్ స్పందిస్తూ.. ‘మొదట నేనే ఈ మారిన రూపాన్ని చూసి షాక్ అయ్యాను కానీ నా కొత్త లుక్ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు గోత్ లుక్ కి బై చెప్పేసాను. ఒక రకంగా చెప్పాలంటే మళ్లీ పుట్టానని చెప్పుకొచ్చింది’ జోర్డాన్ చిన్నప్పటి నుంచి విచిత్రమైన మేకప్, దుస్తులు వేసుకోవడం వల్ల తన అందం గురించి ఎప్పుడూ తెలుసుకోలేకపోయింది.

UPSC ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

Ola Electric Scooter: ఓలా బుకింగ్‌ దారులకు గుడ్ న్యూస్‌.. డిసెంబర్‌ 15 నుంచి డెలివరీ ప్రారంభం..

PM Kisan: రైతులు అలర్ట్‌.. పదో విడత రాకముందే ఈ పని పూర్తి చేయండి.. లేదంటే..?