AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులు అలర్ట్‌.. పదో విడత రాకముందే ఈ పని పూర్తి చేయండి.. లేదంటే..?

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం-కిసాన్) 10వ విడత పంపిణీకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే

PM Kisan: రైతులు అలర్ట్‌.. పదో విడత రాకముందే ఈ పని పూర్తి చేయండి.. లేదంటే..?
Pm Kisan
uppula Raju
|

Updated on: Dec 14, 2021 | 12:01 PM

Share

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం-కిసాన్) 10వ విడత పంపిణీకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే దీనికి ముందు కొత్తగా అప్లై చేసుకున్న రైతులు తమ ఈ-కెవైసి పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ డబ్బు నిలిచిపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఆధార్ కార్డ్ ఆధారిత OTP ప్రమాణీకరణ కోసం కిసాన్ కార్నర్‌లోని e-KYC ఎంపికపై క్లిక్ చేయండి. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం మీరు మీ సమీప CSC కేంద్రాన్ని కూడా సంప్రదించవచ్చు.

ఏదైనా సమస్య ఉంటే మీరు PM కిసాన్ యోజన (155261 లేదా 011-24300606) హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో ఈ పథకానికి సంబంధించి మోసాలు జరుగుతున్నాయి. అక్రమంగా డబ్బులు తీసుకున్న రైతులు 30 లక్షల మందికి పైగా గుర్తించారు. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు ప్రతి స్థాయిలో ధృవీకరణ తర్వాత మాత్రమే డబ్బును విడుదల చేయాలనుకుంటోంది. తమిళనాడులో ఈ పథకంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. ఇందులో చాలా మంది అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమైన పని PM కిసాన్ నిధిలో దరఖాస్తు చేసిన తర్వాత దరఖాస్తుదారు రైతు కాదా అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రైతుల కోసం ఈ పథకం 100 శాతం కేంద్ర నిధుల నుంచి అమలు చేస్తున్నారు. కానీ రైతుల నిజమైన ధృవీకరణ రాష్ట్రం ప్రభుత్వ పని. ఎందుకంటే రెవెన్యూ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. రైతుల పత్రాలను ఎంత వేగంగా వెరిఫై చేస్తే రాష్ట్రంలో అంత ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 5 శాతం ఫిజికల్ వెరిఫికేషన్ హక్కు ఉంటుంది. ఇందులో భూమికి సంబంధించిన రికార్డులు, పన్ను చెల్లింపుదారులా కాదా అనేది నిర్దారించాలి.

జాగ్రత్త వహించండి లేకపోతే నష్టం జరుగుతుంది మీరు ఇంకా ఈ పథకం ప్రయోజనాన్ని పొందకుంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. త్వరలో మీ ఖాతాలో 2000 రూపాయలు వస్తాయి. కానీ దరఖాస్తు చేసేటప్పుడు, ఫారమ్ సరిగ్గా నింపాలి. ఇందులో బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, మొబైల్ నంబర్, భూమి వివరాలు సరగ్గా ఉండాలి. సాధారణంగా ఫారమ్‌ నింపేటప్పుడు చేసిన తప్పుల వల్ల చాలామందికి డబ్బులు రావడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

పాపం ప్రియుడు.. ప్రియురాలి జుట్టు వాసన భరించలేకపోయాడు.. ఏం చేశాడంటే..?

పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా..! నొప్పి లేకుండా ఇలా తగ్గించుకోండి..

PMFBY: రైతులకు గమనిక.. ఫసల్‌ బీమా యోజన వివరాలు వెల్లడించిన కేంద్రం..