పాపం ప్రియుడు.. ప్రియురాలి జుట్టు వాసన భరించలేకపోయాడు.. ఏం చేశాడంటే..?

Man Complains: సోషల్ మీడియాలో ప్రతిరోజు వింత వింత వార్తలు తారపడుతాయి. తాజాగా ఒక వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇది వింటే నవ్వుకోవాలో,

పాపం ప్రియుడు.. ప్రియురాలి జుట్టు వాసన భరించలేకపోయాడు.. ఏం చేశాడంటే..?
Girlfriend
Follow us
uppula Raju

|

Updated on: Dec 14, 2021 | 11:44 AM

Man Complains: సోషల్ మీడియాలో ప్రతిరోజు వింత వింత వార్తలు తారపడుతాయి. తాజాగా ఒక వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇది వింటే నవ్వుకోవాలో, ఏడవాలో తెలియదు. సాధారణంగా లవర్స్‌, భార్య భర్తల మధ్య గొడవలు సహజంగా జరుగుతాయి. అందుకు చాలా కారణాలు ఉంటాయి. కానీ ఒక్కోసారి కొన్ని వింత సమస్యల వల్ల కూడా విడిపోతారు. అవి ఎలా ఉంటాయంటే చాలా సిల్లీగా ఉంటాయి. శుభ్రత కారణంగా కూడా కొన్ని జంటలు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా ఓ ప్రియుడు తన ప్రియురాలి శుభ్రత విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తం చేశాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి తన బాధను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో షేర్ చేశాడు. ఏంటంటే తన ప్రియురాలి జుట్టు ఎప్పుడూ దుర్వాసన వస్తోందని వెంట్రుకలు చాలా జిగటగా ఉంటున్నాయని చెప్పాడు. అంతేకాదు తను వారానికి ఒకసారి మాత్రమే జుట్టును కడుగుతుందన్నాడు. అయితే నేను చెప్పే విషయం చాలా వింతగా ఉందని తెలుసని కానీ ఇది నిజమని వెల్లడించాడు. తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సోషల్ మీడియాలో షేర్ చేశానని వివరించాడు.

అతను ఈ విధంగా చెప్పాడు “నేను నా గర్ల్‌ఫ్రెండ్‌కు తన మురికి అలవాటు గురించి మొదట చెప్పలేదు కానీ తరువాత ఒక రోజు చెప్పవలసి వచ్చింది. నీ జుట్టు దుర్వాసన వస్తోందని, జిగటగా ఉంటుందని చెప్పాను. అప్పుడు ఆమె చాలా కోపంగా తిట్టింది. ఆమె జుట్టు చాలా పొడవుగా, వెంట్రుకలు వంకరగా ఉంటాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి కానీ వారానికోసారి ఒక్కసారి కడగడం వల్ల దుర్వాసన వస్తుంది. నా గర్ల్‌ఫ్రెండ్‌ని జుట్టును కడగమని చాలాసార్లు కోరాను కానీ ప్రతిసారి ఆమె తిరస్కరించింది. ఇది సాధారణ విషయమే అయినా ఈ అలవాటు వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాను”

పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా..! నొప్పి లేకుండా ఇలా తగ్గించుకోండి..

Australia: ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. 15 మంది ఆటగాళ్ల పేర్లు ఖరారు..

ఏకకాలంలో మూడు జట్లకు కోచింగ్‌ చేస్తున్న శ్రీలంక లెజండరీ బ్యాట్స్‌మెన్‌.. ఇది ఎలా జరిగిందంటే..?